Home

»

Tv News

సుధీర్‌కు చైత్రా రాయ్ సపోర్ట్.. జెన్యూన్‌గా ఉంటే గౌరవం దక్కాలి!

Sep 23, 2026 11:28AM

బిగ్ బాస్ తెలుగు 10 లో సుధీర్ కు జరిగిన అవమానంపై సెలబ్రిటీల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హీరో ప్రభాకర్ సుధీర్ కు సపోర్ట్ గా వీడియో చేయగా.. ఇప్పుడు ప్రముఖ నటి చైత్రా రాయ్ కూడా సుధీర్ కు అండగా నిలిచింది. బిగ్ బాస్ హౌస్ లో సుధీర్ పై శ్రిష్టి, త్రిగుణ్ గ్యాంగ్ చేసిన దాడి తలపై చెత్త వేసిన ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సుధీర్ వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

నేను చూసిన హౌస్‌మేట్స్‌లో సుధీర్ అత్యంత జెన్యూన్ అండ్ రెస్పెక్ట్‌ఫుల్ జెంటిల్‌మెన్. అతనితో ప్రవర్తించిన తీరు అస్సలు కరెక్ట్ కాదు. పరిస్థితి ఏదైనా,.. ఎప్పుడూ జెన్యూన్ గా ఉండే వ్యక్తికి గౌరవం దక్కాలని చైత్రా రాసుకొచ్చింది. "I completely support Sudheer" అంటూ #ISupportSudheer అనే హ్యాష్‌ట్యాగ్ తో సుధీర్‌ని ట్యాగ్ చేసింది. నామినేషన్ టాస్క్‌లో భాగంగా.. నాకు ఫ్రీడమ్ వచ్చిందని సుధీర్ అన్న చిన్న మాటకు వంకర అర్థం తీసి శ్రిష్టి అతని క్యారెక్టర్ పై దాడి చేసి, చెత్తను మొహంపై కొట్టడంపై ఆడియన్స్ కూడా మండిపడుతున్నారు.

ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో #ISupportSudheer ట్రెండ్ అవుతోంది. జనాలు సుధీర్‌ని టార్గెట్ చేయడాన్ని తప్పుబడుతూ అతనికి అండగా పోస్టులు పెడుతున్నారు. సుధీర్ గేమ్‌లో పెద్దగా కనిపించడం లేదనుకున్న టైంలోనే ఇలా టార్గెట్ కావడంతో అనూహ్యంగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఆడియన్స్ సింపథీ మొత్తం సుధీర్ వైపు తిరగడంతో అతని ఓటింగ్ భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సెలబ్రిటీల మద్దతు కూడా తోడవ్వడంతో సుధీర్ ఈ వారం నామినేషన్ నుంచి సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని టాక్.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com