
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 1137 లో.....రాజ్, ఇందుకి అండగా నిలబడ్డాడు. ఇందు చేయి ఎప్పటికి వదిలిపెట్టనని రాజ్ గట్టిగా చెప్పడంతో.. నోర్మూయ్, అలా అనడానికి సిగ్గులేదా అని రేఖ తిడుతుంది. దానికి రాజ్ .. పిన్నీ నా లిమిట్స్ లో ఉండి మాట్లాడుతున్నా కాబట్టే ఇలా మాట్లాడుతున్నావ్, లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని వార్నింగ్ ఇచ్చి జరిగిందంతా ఇందుకి చెప్తాడు. సిరిని ఇక్కడికి తీసుకొస్తే బాగుండేదని ఇందు అంటే..ఇప్పటికే రేఖ వాళ్లు నానా మాటలు అంటున్నారు, తీసుకొస్తే ఇంకా రచ్చ అవుతుంది.. నువ్వు నాకోసం చాలా చేశావ్.. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను.. ఇక నావల్ల నువ్వు మాటలు పడాల్సిన అవసరం లేదు.. సిరి నాన్న వాళ్లతో సేఫ్ గా ఉంటుందని ఇందుకి రాజు ధైర్యం చెప్తాడు.
మరోవైపు సిరి.. నా మొగుడు కావాలి.. నేను ఇక్కడ ఉండను.. వెంకీకి ఫోన్ చేయండి అంటూ ఏడుస్తూ గోల చేస్తుంది. ఇష్టమైన న్యూడిల్స్ కూడా తినలేదు. దాంతో వెంకీ జోకర్ లా గెటప్ వేసుకుని బాల్స్ తో వచ్చి సిరిని ఆడిస్తూ న్యూడిల్స్ తినిపించేందుకు ట్రై చేశాడు.. చివరికి వెంకీ అలసిపోతే సిరినే వచ్చి తినేస్తుంది. ఇంకోవైపు ఇందుకి డిగ్రీ పాస్ కావడం ఇష్టంలేని రేఖ, భ్రమరాంబలు ఐశ్వర్యను పావుగా వాడుకుంటారు. ఇందును దెబ్బకొట్టు, 5 వేలు కాదు 50 వేలు అడుగమని ఫిట్టింగ్ పెట్టి పంపిస్తారు. నువ్వే నా బ్రహ్మాస్త్రానివి, నీతోనే ఈ సామ్రాజ్యాన్ని కూలగొడతానని రేఖ మనసులో అనుకుంది.
ఐశ్వర్య వచ్చి డబ్బులు అడగగానే ఇందు.. డబ్బులు ఇస్తా కానీ రాజ్ ని అంటే ఊరుకోను..నోరు అదుపులో పెట్టుకోమని 50 వేలు ఇస్తుంది. ఇదంతా నీ ప్లాన్, నా ఇగో హర్ట్ అయితే డబ్బులు తీసుకోనని తెలిసే అవమానించావ్.. నేను ఎగ్జామ్ రాయకూడదని చూస్తున్నావ్.. నేనే తెచ్చుకుని డిగ్రీ పాస్ అయి చూపిస్తానని కోపంగా వెళ్లిపోయి రాజ్ ని కోపంగా చూస్తుంది ఐశ్వర్య.తరువాయి భాగంలో లాడ్జ్ నుంచి మదన్, స్వాతిలను పోలీసులు బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వార్త టీవీ న్యూస్ లో రావడంతో రేఖ వాళ్లు చూసి రాజ్ ని నిందిస్తూ తిడతారు. రాజ్, ఇందు వాళ్లను కాపాడేందుకు వెళ్తామంటే రేఖ అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






