
బిగ్ బాస్ సీజన్ 10 రెండో వారం నామినేషన్స్ కోసం బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఏంటే రోప్ అండ్ థ్రెడ్ టాస్క్. జంటలు జంటలుగా నామినేషన్స్ లో పాల్గొనాలి. రోప్ కి కట్టిన తాడును మొత్తం విప్పి, ఆ తర్వాత అక్కడున్న గొడ్డలిని పట్టుకొని నామినేషన్స్ ప్రక్రియ చేపట్టాలి.
ఇందులో త్రిగుణ్, శ్రిష్టిలు పోటీపడగా, త్రిగుణ్ మొదట తాడు విప్పి గొడ్డలి పట్టుకున్నాడు. గొడ్డలి పట్టుకోగానే ప్రోమో కట్ కోసం అన్నట్టు ఓ రేంజ్ లో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. ప్రతి కెమెరా వైపు చూస్తూ లుక్కులు ఇచ్చాడు.. కళ్లు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నట్టు చేసి, గొడ్డలి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ పర్ఫామెన్స్ ఇచ్చాడు. నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టగానే త్రిగుణ్ మొదట సుధీర్ ని నామినేట్ చేశాడు. గ్రూప్ గేమ్, బ్రెయిన్ వాష్, డబుల్ స్టాండర్డ్స్ అంటూ తాను చేసే పనులన్నీ సుధీర్ చేస్తున్నాడని ఆరోపించాడు. అతని సుధీర్ఘ ప్రసంగం లైవ్ లో దాదాపు గంట పాటు సాగింది కానీ అందులో ఒక్క నిజం కూడా లేదని లైవ్ చూసినవాళ్లు అంటున్నారు. జనం చూస్తున్నారు, నన్ను ముందు సేవ్ చేశారు, అది గుర్తు పెట్టుకోండి అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించాడు. నాతో గొడవ పెట్టుకుంటే టీవీలో ఎక్కువ కనిపిస్తారని సుధీర్, రోహిత్ లను ఉద్దేశించి అన్నాడు.
అలాగే శ్రిష్టిపై నోరు జారిన విషయాన్ని కవర్ చేస్తూ.. నాకు ఐదుగురు చెల్లెళ్లున్నారు.. ఆడాళ్ల గురించి అలా మాట్లాడటం నా ఉద్దేశం కాదుంటూ సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టాడు. దానికి శ్రిష్టి మాత్రం తగ్గలేదు.. మాటకి మాట ఇచ్చిపడేసింది. మాట్లాడితే అగ్నిపరీక్ష గ్రూప్ అంటున్నారు కానీ మీరు చేస్తున్నది ఏంటని నిలదీసింది శ్రిష్టి. ఎవరైనా నామినేషన్ పాయింట్స్ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టి జనాలకు ఏదో పంపిస్తున్నారు.. ఇక్కడ క్లియర్ ఫేవరిటిజం నడుస్తోందని త్రిగుణ్ గురించి ఇన్ డైరెక్ట్ గా షాలినీ అంది. దానికి త్రిగుణ్.. మీరు కూడా కొట్టండి" అనడంతో శ్రిష్టి, రోహిత్ చప్పట్లు కొట్టి షాలినీకి కౌంటర్ ఇచ్చారు. దీంతో నామినేషన్స్ టాస్క్ మొత్తం చప్పట్ల రచ్చగా మారింది.





