Home

»

Tv News

Brahmamudi : రాజ్ మొదటి భార్య సిరి.. బర్త్ డే రోజే షాక్ ఇచ్చిన రేఖ!

Sep 8, 2026 9:49AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  బ్రహ్మముడి Brahmamudi .ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్  1131 లో రాజ్ బర్త్ డే కి ఇందు ఏర్పాట్లు చేస్తుంది. తీరా రాజ్ వచ్చి కేక్ కట్ చేస్తుంటే రేఖ వచ్చి.. ఇప్పుడు అందరికీ ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నానని అంటుంది. ఏంటదని అందరు అడుగుతారు.

 

రాజ్ ఇప్పటివరకు హాస్పిటల్ కి వెళ్లి వచ్చాడని అనగానే అందరు షాక్ అవుతారు. అసలు రాజ్ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు.. మనం అందరం ఇక్కడే ఉన్నాం.. రాజ్ హాస్పిటల్ కి ఎందుకు వెళ్లి ఉంటాడని రేఖ అంటుంది.హాస్పిటల్ లో రాజ్ భార్య ఉంది.. మొదటి భార్య" అని రేఖ చెప్పగానే అందరు షాక్ అవుతారు. తన పేరు సిరి అని రేఖ చెప్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు.. అదంతా నాకు రాజ్ చెప్పాడు. రాజ్ ముందు కేక్ కట్ చెయ్ అని ఇందు తనతో కేక్ కట్ చేయిస్తుంది.

 

ఆ తర్వాత రాజ్, ఇందు మాట్లాడుకుంటారు. అదేంటీ ఇందు, నేను నీతో సిరి గురించి చెప్పలేదు కదా అని రాజ్ అంటే చెప్పలేదు కానీ నువ్వు ఒక విషయం దాచావంటే ఏదో ఒక రీజన్ ఉంటుందని ఆలోచించి ఇలా చేశానని ఇందు అనగానే రాజ్ తనని హగ్ చేసుకొని చాలా థాంక్స్ అని చెప్తాడు.

ఆ తర్వాత అసలు సిరి ఎవరనేది ఇందుకి చెప్తాడు. సిరి వాళ్లు వస్తుంటే నా కార్ యాక్సిడెంట్ చేసింది.. తన పేరెంట్స్ చనిపోయారు. తనకి ట్రీట్మెంట్ చేయిస్తున్నా తప్పనిసరి పరిస్థితిలో తన భర్తగా సంతకం చేయాల్సి వచ్చిందని రాజ్ చెప్తాడు.

 

ఆ సిరి స్పృహలోకి రాగానే ఈ విషయం చెప్పాలని రాజ్ అంటే, వద్దు అని ఇందు అంటుంది. తరువాయి భాగంలో ఆస్తులన్నీ సొంతం చేసుకోవడానికి ఒకే ఒక ఆయుధం ఆ లక్కీ అని భూషణ్ వాళ్లతో రేఖ చెప్తుంది. లక్కీకి రేఖ భోజనం తినిపిస్తుంది.. అదంతా చూసి రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com