
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari .ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 106 లో జానూ వాళ్లు ఇల్లు రెంట్ కోసం వెళ్తారు. అక్కడ తీరాచూస్తే శివరాం, పార్వతి ఉంటారు. అమ్మాయి నువ్వా అని శివరాం అంటాడు. ఇది మీ ఇల్లా అని జానూ ఆశ్చర్యంగా అడుగుతుంది. అవునని శివరాం అంటాడు.
జాను రావడంతో ఇద్దరు దంపతులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలాగైనా సరే ఈ అమ్మాయికి అద్దెకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటారు.వాళ్ల మాటలు విన్న సంజయ్ లోపల నుంచి.. తాతయ్యా అద్దెకి ఇవ్వడం అవసరమా అని అంటాడు. దాంతో శివరాం లోపలికి వెళ్లి.. ఇప్పుడు అవసరమే అని అతన్ని కన్విన్స్ చేస్తాడు. మీరు ఇంట్లోకి వచ్చేయండి, మా వాడు ఒప్పుకున్నాడని వాళ్లకి శివరాం చెప్తాడు. దాంతో జానూ, నందు, మురళి హ్యాపీగా వెళ్తారు.
మరోవైపు సూర్య ఇంకా తన ఫ్రెండ్ కలిసి జానూ వాళ్ల కోసం వెతుకుతూ ఉంటారు. ప్లీజ్ రా ఈ ఒక్క రోజుకి బ్రేక్ ఇవ్వరా అని ఫ్రెండ్ అడుగుతాడు. లేదు రా, నా జానూ దొరికే వరకు ఆగవద్దని సూర్య చెప్తాడు. ఆ తర్వాత బాబిన్ కి సూర్య ఫోన్ చేసి.. మురళి నెంబర్ చేంజ్ చేశాడు కదా, ఒకసారి నెంబర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో బాబిన్ ఇస్తాడు. మురళికి సూర్య ఫోన్ చేస్తాడు కానీ కలవదు.మరోవైపు వెంకట్రావు దెబ్బలతో ఇంటికి వస్తాడు. ఏమైందని అందరు అడుగుతారు. మీకు సహాయం చేస్తున్నానని ఆ సింహాద్రి కొట్టించాడని అతను చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






