Home

»

Tv News

Ye Devi Varamo Neevu : అంజలి కోసం రాకీ వెతుకులాట..మనీష్ ఎంట్రీతో షాక్!

Sep 9, 2026 9:28AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  ఏ దేవి వరమో నీవు   Ye Devi Varamo Neevu . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 59 లో  గీతకి అంజలి గోరింటాకు పెట్టి కిచెన్ లోకి వెళ్తుంది. అప్పుడే అంజలి రూమ్ దగ్గరికి రాకీ వెళ్లి డోర్ కొడతాడు.. డోర్ ఓపెన్ లో ఉండటంతో.. నాకోసమే ఓపెన్ లో పెట్టిందని హ్యాపీగా లోపలికి వెళ్తాడు. తీరా చూస్తే అందులో అంజలి ఉండదు. దీంతో రాకీకి కోపం వస్తుంది.

 

ఆ తర్వాత పార్టీకి వెళ్లిన భవిత కోసం అంజలి వెయిటింగ్ చేస్తుంది. భవిత రాగానే.. ఇంకా నిద్రపోలేదా అని అడుగుతుంది. ఇలా రాత్రి వెళ్తే ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ.. ఈ విషయం అమ్మకి తెలిస్తే అని అంజలి అనగానే ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా.. ఎంత కావాలి చెప్పు.. ఓ ఐదు వేలు నీ మొహంపై పడేస్తానని అనేసి భవిత వెళ్లిపోతుంది. కిచెన్ లో వాటర్ సౌండ్ రావడంతో అంజలి అక్కడికి వెళ్తుంది. అక్కడ రాకీ ఉంటాడు. అతన్ని చూసి భయపడి చేయి పట్టుకోగానే.. అమ్మా అంటూ అరుస్తుంది. దీంతో మనీష్ వస్తాడు. రాకీ దాక్కుంటాడు. నీడను చూసి భయపడ్డాను, నాతో రూమ్ వరకు రా అని అంజలి అనగానే మనీష్ తోడుగా వెళ్తాడు. రాకీ డిస్సపాయింట్ అవుతాడు.

 

మరుసటి రోజు గీత లేచేసరికి తన చేతికి గోరింటాకు చూసి.. ఎవరు పెట్టారని అడుగుతుంది. నేనే అని అంజలి చెప్పినా రత్నం.. నేనే పెట్టానని రత్నం కవర్ చేస్తుంది. ఆ తర్వాత రాకీ ఫోన్ లో అంజలి ఫోటో చూస్తుండగా మనీష్ ఫోన్ లాక్కుంటాడు. మనకి రోజంతా ఏది చేతిలో ఉంటుందో అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుందని మనీష్ అంటాడు. రాత్రి నీ గదికి వచ్చాను.. ఎక్కడికి వెళ్లావు.. చదువుకోమంటే అసలు వినట్లేదని కోప్పడితే.. చదువుకుంటున్నా అన్నయ్య అని రాకీ అంటాడు. ఎక్కడ, టెర్రస్ పైనా అని మనీష్ కోప్పడటంతో ఎక్కడ ఫోటో చూస్తాడోనని రాకీ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com