
బిగ్ బాస్ కి వెళ్ళాలనే ఆలోచన ఉంటే ఏ టాస్క్ ఇచ్చినా సరే డేర్ చెయ్యాలిసిందే.. ఇప్పుడు అగ్నిపరీక్షలో అదే జరుగుతుంది.. అగ్ని పరీక్ష ఏడో ఎపిసోడ్‌లో ముక్కు, చెవి, బ్రో కుట్టించుకునే డేర్ వచ్చినప్పుడు రోహిత్, హేమంత్ ఇద్దరూ స్టేజ్ ఎక్కారు. కానీ జడ్జ్‌లు ముక్కు కుట్టించుకోమనేసరికి రోహిత్ దడిచిపోయి సైడ్ కి జారుకున్నాడు. వెంటనే అభిజిత్, శ్రీముఖి ఫుల్ క్లాస్ తీసుకున్నారు. డేర్ అంటే ఇదేనా, చేతులెత్తకుండా ఎలా అని ఫైర్ అయ్యారు. అదే టైంలో హేమంత్ మాత్రం.. పర్వాలేదు అంటూ చెవి, ముక్కు రెండూ కుట్టించుకుని అందరి దగ్గర మార్కులు కొట్టేశాడు.
క్లిప్స్ టాస్క్‌లో రోహిత్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. గాయత్రి, జ్యోత్స్నతో పోటీ పడి అత్యధిక క్లిప్స్ పెట్టుకుని గెలిచి టాప్-15 టికెట్ పక్కా చేసుకున్నాడు. హేమంత్ కూడా సైలెంట్‌గా ఉంటూనే డేర్‌ని కంప్లీట్ చేసి తన ప్లేస్ సంపాదించుకున్నాడు. ఇద్దరూ వేరు వేరు స్టైల్. ఒకడు రిస్క్ తీసుకుని గెలిచాడు, ఇంకొకడు భయపడి కౌంటర్లు తిన్నాడు.
ఫైనల్‌గా ఇద్దరూ టాప్-15లోకి వెళ్లిపోయారు. హేమంత్ .. డేర్ బాయ్ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు. రోహిత్ టాస్క్‌లో గెలిచినా, డేర్ నుండి వెనక్కి తగ్గడం వల్ల నెగెటివ్ టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు జనాలు ఓట్లు వేసే టైమ్. ఎవరు ఇంట్లో ఉండాలో ఎవరు ఉండకూడదో ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు. ఎవరు లాంగ్ రన్ వెళ్తారో చూడాలి మరి.






