
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం 2 Karthika Deepam2.ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 760 లో......పెళ్లికి ముందు రోజు సూరజ్ తన రూమ్ లో బట్టలకు ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాడు. జ్యోత్స్న వచ్చి రేపు పెళ్లి పెట్టుకుని రెస్ట్ తీసుకోకుండా ఇదేంటని అడుగుతుంది. దానికి సూరజ్ బ్యాచిలర్ లైఫ్ లో ఇవన్నీ అవసరమే అంటాడు. అప్పుడు జో కావాలని రెచ్చగొడుతూ అబ్బాయిలకు ఇంతకంటే అవసరమైన పనులు ఉంటాయి.. కాబోయే భార్యతో ముచ్చట్లు పెట్టుకోవడం లాంటివి అంటూ దగ్గరికి వచ్చి.. నువ్వుంటే చాలూ అంటూ పాట పాడుతూ ముద్దు పెట్టబోతుంది.
అయితే సూరజ్ మొహం తిప్పేసుకుంటాడు. సిగ్గు వదిలి ముందుకొచ్చిన అమ్మాయిని కాదనడంతో జ్యోత్స్న హర్ట్ అవుతుంది. ఎందుకలా చేశావని అడుగుతుంది. దానికి సూరజ్ ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇంకా నా భార్య కాలేదు, కాబోయే భార్యవే.. ఆ రెండింటికీ చాలా తేడా, చాలా దూరం ఉంది అంటాడు. ఆ దూరం రేపటితో పోతుంది కదా అంటే, ఇంకా రేపటి వరకూ టైం ఉంది అంటూ కట్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న..నీకేం కావాలంటే అదే తీసుకుంటావ్, ఎదుటివాళ్లు ఇస్తే తీసుకోవ్.. పెళ్లయ్యాక అయినా మారి నాకు బెస్ట్ ఫ్రెండ్ లా ఉండరా అంటూ ఎమోషనల్ గా చేయి పట్టుకుంటుంది.
ఇంతలో శ్రీధర్, కార్తీక్, దీప వచ్చి డిస్టర్బ్ చేశామా అంటారు. సూరజ్ వెంటనే జ్యోత్స్ననే వచ్చింది నేను పిలవలేదు అంటూ బుక్ చేస్తాడు. శ్రీధర్ సూరజ్ ని మా ఇంటికి రా, మగపెళ్లివాళ్లు ఆడపెళ్లివాళ్ల ఇంట్లో ఉండకూడదు.. రేపు మంగళస్నానం చేసి దర్జాగా వద్దామని అంటాడు. సూరజ్ నేను అవుట్ హౌస్ లోనే కదా ఉన్నా అని వద్దంటాడు. సూరజ్ ఎవరి మాట వినడు మనమే వినాలని జ్యోత్స్న చెప్పి సిగ్గుపడుతూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ సూరజ్ తో.. పెళ్లికి ముందే అడ్వాన్స్ అవుదాం అనుకుంటున్నావా.. పెళ్లాన్ని కంట్రోల్ లో పెట్టాలని చెప్తుండగా దీప వచ్చి పట్టుకుంటుంది. అందరు వెళ్లిపోయాక సూరజ్ సడన్ గా.. సారీ బ్రదర్, సారీ వదినా అంటాడు. ఎందుకు సారీ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అంటాడు. దీప మాత్రం పెళ్లి పనులన్నీ మనమే చేస్తున్నాం కదా అని ఫీల్ అయి సారీ చెప్పాడులే అంటుంది. కానీ కార్తీక్ కి డౌట్ పోదు.. మాలిని ఇంట్లో సూరజ్ ని చూసింది గుర్తొచ్చి ఏదో తేడా ఉందని అనుకుంటాడు. తెల్లారేసరికి జ్యోత్స్న, సూరజ్ ఇద్దరూ పెళ్లి గెటప్ లో అదిరిపోతారు. శౌర్యకి జ్యోత్స్న చాక్లెట్ ఇచ్చి సూరజ్ ఫొటో తీసుకురమ్మని పంపిస్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






