TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Bigg Boss 10 Telugu: హౌస్ లోకి నిఖిల్, పృథ్వీ ఎంట్రీ..సుధీర్ విన్, కెప్టెన్సీ రేసులోకి ఆ ఆరుగురు!

Nov 27, 2026 11:13AM

బిగ్ బాస్ సీజన్-10 తెలుగులో పన్నెండో వారం బడ్డీ థీమ్‌తో సాగుతుంది. ఎక్స్ కంటెస్టెంట్స్ జంటలుగా వచ్చి హౌస్ మేట్స్‌తో టాస్క్ ఆడి.. హౌస్‌లోని వారిని కెప్టెన్సీ కంటెండర్స్‌గా చేస్తూ వస్తున్నారు. టేస్టీ తేజ, శోభాశెట్టి, ఇమ్మాన్యుయేల్, సంజన, కళ్యాణ్ పడాల, దివ్య నిఖిత, డీమాన్ పవన్, రీతూ చౌదరి, వీజే సన్నీ, సిరి, నిఖిల్, పృథ్వీ హౌస్‌లోకి వచ్చి ఇప్పటివరకు టాస్క్‌లు ఆడారు.

 

నిన్నటి ఎపిసోడ్‌లో నిఖిల్, పృథ్వీ హౌస్‌లోకి వస్తారు. అందరికీ కొన్ని సలహాలు ఇస్తారు. హౌస్ మేట్స్ అందరిని జంటలుగా ఏర్పడమని చెప్పారు నిఖిల్, పృథ్వీ. హౌస్‌లో పదకొండు మంది ఉండటంతో చివరకు అమన్ ఒక్కడే మిగిలాడు. త్రిగుణ్ కోసం వంశీ, దేబ్జానీ కోసం రాం ప్రసాద్, నరేష్ కోసం సుధీర్, వర్షిణి కోసం ముఖేష్, రామకృష్ణ కోసం శివ్ సాక్రిఫైజ్ చేసేందుకు రెడీ అవుతారు. ఇలా సాక్రిఫైజ్ చేసిన వాళ్లు.. ఇంత వరకు కెప్టెన్సీ కంటెండర్ పోటీల్లో పాల్గొని వారిలోంచి నిఖిల్, పృథ్వీలు ఎంచుకుంటారు. అలా సుధీర్ కోసం నిఖిల్, వంశీ కోసం పృథ్వీ ఆడేందుకు సిద్ధపడతారు. అన్‌లాక్.. బిల్డ్ పిరమిడ్.. అంటూ రెండు దశల్లో సాగే ఈ టాస్క్‌లో సుధీర్ ముందుంటాడు.

 

సిలిండర్లను అన్‌లాక్ చేయడంలో సుధీర్ మెరుపు వేగాన్ని చూపిస్తాడు. కానీ వంశీ అక్కడే స్ట్రక్ అవుతాడు. దీంతో సుధీర్ విన్ అవుతాడు. సుధీర్‌కి తగ్గట్టుగా నిఖిల్ కూడా పిరమిడ్‌ను ఫాస్ట్‌గా ఫినిష్ చేసేస్తాడు. అలా చివరకు కెప్టెన్సీ రేసులోకి రామకృష్ణ, శివ్, దేబ్జానీ, అమన్, నరేష్, సుధీర్ వచ్చేశారు. మరి వీరిలో చివరి కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి మరి.

 

google-ad-img