TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

BiggBoss 10 Telugu :అమ్మ ఏడ్చేసింది.. ఫ్యామిలీని లాగొద్దంటూ రోహిత్ ఫైర్!

Nov 27, 2026 11:02AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నుంచి రోహిత్ నాయుడు ఎలిమినేషన్ ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. 56 రోజులు హౌస్ లో ఉండి, అగ్నిపరీక్ష ద్వారా వచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న రోహిత్.. ఆడియన్స్ ఓటింగ్ తో కాకుండా హౌస్ మేట్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ కావడం వివాదం రేపింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ ఎమోషనల్ అయ్యాడు.

 

ఎలిమినేషన్ అయ్యాక అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది, నా ఫ్యామిలీ చాలా బాధపడిందని రోహిత్ చెప్పాడు. అగ్నిపరీక్షలో తన జర్నీ, హౌస్ లో తనను టార్గెట్ చేయడం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం బయటకు వచ్చానని క్లారిటీ ఇచ్చాడు. తన ఎలిమినేషన్ పై ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా బాధపడ్డారని అన్నాడు.అంతేకాదు, బయటకు వచ్చాక త్రిగుణ్ ఫ్యాన్స్, PR టీమ్ తన తల్లి, చెల్లిని టార్గెట్ చేస్తూ అసభ్యకర ఆడియో క్లిప్స్ వైరల్ చేయడంపై రోహిత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. మీకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి, హద్దు దాటితే నేరుగా మీ ఇంటికే వచ్చి మీ భార్యకు ఆ క్లిప్స్ వినిపిస్తానని హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫైర్ అయ్యాడు. తను గేమ్ నుంచి బయటకు వచ్చేశానని, ఇక ఇటువంటి వివాదాలు ఆపాలని రోహిత్ కోరాడు.

 

హౌస్ లో ఉన్నన్నిరోజులు రోహిత్ వర్సెస్ త్రిగుణ్ గేమ్ సాగింది. అతను ఉన్నంతవరకు రోహిత్ విన్నర్ అవుతాడని త్రిగుణ్ రన్నర్ అవుతాడని అనుకున్నారంతా కానీ రోహిత్ ఎలిమినేషన్ తర్వాత అంతా మారిపోయింది. 

 

google-ad-img