Home

»

Tv News

పిల్ల బచ్చా స్టెరాయిడ్ బాడీ అంటూ రోహిత్ పై త్రిగుణ్ ఘాటు కామెంట్స్!

Sep 11, 2026 9:51AM


బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వారం నుంచే రోహిత్ వర్సెస్ త్రిగుణ్ వార్ హాట్ టాపిక్ గా మారింది. అగ్నిపరీక్ష బ్యాచ్ అయిన త్రిగుణ్, సెలబ్రిటీ అయిన రోహిత్ పై సీరియస్ కామెంట్స్ చేస్తున్నాడు. తాజాగా త్రిగుణ్ రోహిత్ ని చూసి "పిల్ల బచ్చా" అంటూ ఎగతాళి చేశాడు. "ఛీ... మీలాగా నేను అగ్నిపరీక్ష నుంచి రాలేదంటూ రోహిత్ ని కించపరిచాడు.

నిన్ను చూసి స్క్రిప్ట్ రాసేంత బొమ్మ నీకు లేదంటూ రోహిత్ టాలెంట్ ని కూడా క్వశ్చన్ చేశాడు త్రిగుణ్. అంతేకాదు స్టెరాయిడ్ తో బాడీ షో ఆఫ్ చేస్తున్నావంటూ రోహిత్ ఫిజిక్ పై కూడా వ్యంగ్యంగా మాట్లాడు.

మొదటి రోజు నుంచే రోహిత్ పై త్రిగుణ్ కి కోపం ఉందని అగ్నిపరీక్ష నుంచి వచ్చిన తనే అసలైన ఫైటర్ అని ప్రూవ్ చేసేందుకే ఇలా మాట్లాడుతున్నాడని హౌస్ లో చర్చ జరుగుతోంది. త్రిగుణ్ మాటలకు రోహిత్ కూడా గట్టి కౌంటర్ ఇస్తుండడంతో ఇద్దరి మధ్య గొడవలు రోజురోజుకి పెరుగుతున్నాయి. రెడ్ వర్సెస్ బ్లూ టీమ్ టాస్క్ లో కూడా ఈ ఇద్దరి మధ్య వాదనలు పీక్స్ కి వెళ్లాయి. వీకెండ్ లో నాగార్జున ఈ విషయంపై క్లాస్ పీకే అవకాశం ఉందని అభిమానులు అంటున్నారు. అగ్నిపరీక్ష  వర్సెస్ సెలబ్రిటీ అనే గొడవ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com