
బిగ్ బాస్ హౌస్ లో టుడే ఎపిసోడ్ లో చైత్ర, వంశీ చేసిన పర్ఫామెన్స్ అందరి మనసుల్ని కదిలించింది. భార్యాభర్తల మధ్య జరిగే సాధారణ సమస్యని వాళ్లు చాలా రియల్ గా చూపించారు.
స్కిట్ లో వంశీ తాగి ఇంటికి వచ్చిన భర్త పాత్రలో నటించాడు. చైత్ర కోపంగా కాకుండా ఎమోషన్స్ తో, కన్నీళ్లతో భర్తతో మాట్లాడింది. ఇలా తాగొస్తే మన కుటుంబం ఎలా ఉంటుందంటూ ఆమె చెప్పిన మాటలు వంశీని పూర్తిగా మార్చేశాయి. వంశీ చైత్ర కాళ్లు పట్టుకునే సీన్ కి ఆడియన్స్ ఎమోషనల్ అయ్యారు. చైత్ర గారు ఇది skit లా లేదు, జీవించేసారు... Acting Peaks lo అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియన్స్. వంశీ అన్న కాళ్లు పట్టుకునేసరికి ఇంకా పీక్స్ లోకి వెళ్లిపోయింది సీన్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.ఇద్దరి కెమిస్ట్రీ, ఎమోషనల్ ఎక్స్ ప్రెషన్స్ తో ఈ స్కిట్ ఈ వారం బెస్ట్ పర్ఫామెన్స్ లలో ఒకటిగా నిలిచింది. నాగార్జున కూడా వీళ్ల పర్ఫామెన్స్ ని మెచ్చుకునే అవకాశం ఉంది. నిజంగా ఇది యాక్టింగ్ కాదు.. మన ఇంట్లో జరిగే కథ అంటూ హౌస్ మేట్స్ కూడా చైత్ర, వంశీలని అభినందించారు.






