Home

»

Tv News

లేడీ కట్టప్పగా మారిన జాన్సీ... కామనర్స్ టీమ్ కి వెన్నుపోటు!

Sep 11, 2026 9:46AM

బిగ్ బాస్ హౌస్ లో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన జాన్సీ తన ప్రవర్తనతో అందరిని షాక్ కి గురిచేస్తోంది. కామనర్స్ టీమ్ నుంచి వచ్చిన కూడా ఆ టీమ్ కి సపోర్ట్ చేయకుండా సెలబ్రిటీలకే సపోర్ట్ చేస్తోంది.

హౌస్ లో రెడ్ అండ్ బ్లూ టీమ్ లు విడిపోయినప్పుడు జాన్సీ కామనర్స్ టీమ్ లో ఉన్నా.. ఆ టీమ్ స్ట్రాటజీలు, గొడవలు.. ప్లాన్స్ అన్నీ సెలబ్రిటీ టీమ్ కి చేరవేస్తోంది. తన టీమ్ మెంబర్స్ తో కలిసి ఆడకుండా, సెలబ్రిటీలతోనే గడిపి వాళ్లకు అనుకూలంగా మాట్లాడుతోంది. మొదటి వారంలో జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా జాన్సీ తన టీమ్ కి వెన్నుపోటు పొడిచింది. హై రిస్క్ లో ఉన్న చరణ్ కి సపోర్ట్ చేయకుండా బ్లూ టీమ్ నాయకుడు రాంప్రసాద్ కి అండగా నిలిచింది. చరణ్ గేమ్ సీరియస్ గా ఆడటం లేదని.. అతను అనర్హుడని చెప్పి నామినేట్ చేసే ప్రక్రియలో కూడా పాల్గొంది. అగ్నిపరీక్ష నుంచి వచ్చి కూడా కామనర్స్ టీమ్ కి న్యాయం చేయకుండా అవతలి టీమ్ కి వత్తాసు పలకడంతో హౌస్ లో.. జాన్సీ ఒక లేడీ కట్టప్ప అంటూ కామెంట్స్ వస్తున్నాయి. తన సొంత టీమ్ ని నమ్మించి.‌ వెనుక నుంచి దెబ్బ కొట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పుడు ఆడియన్స్ కూడా జాన్సీ ఆటతీరుపై ఫైర్ అవుతున్నారు. టీమ్ స్పిరిట్ లేకుండా కేవలం తన సేఫ్ గేమ్ కోసం ఆడుతోందని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో జాన్సీ ఈ వెన్నుపోటు వ్యవహారం పై ఏమంటారో చూడాలి మరి.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com