Home

»

Tv News

తొక్కలో అగ్నిపరీక్ష అన్న త్రిగుణ్... వీకెండ్ లో నాగార్జున క్లాస్ తప్పదా?

Sep 11, 2026 10:11AM

బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ లో మహా పరీక్ష మరింత రంజుగా మారింది. హై రిస్క్ లో ఉన్న రాంప్రసాద్, చరణ్ లను నిలబెట్టి ఇంటి సభ్యులతో నామినేషన్ ప్రక్రియ చేయించారు బిగ్ బాస్. ఎవరైతే ఇంటి నుంచి బయటకు పంపాలనుకుంటున్నారో వాళ్ల ముఖంపై పెయింట్ పూసి కారణం చెప్పాలన్నారు. మొదట త్రిగుణ్ వచ్చి చరణ్ కి రంగు పూశాడు. రాంప్రసాద్ తనకి తను రిస్క్ తీసుకున్నందుకు గ్రేట్ అంటూ సపోర్ట్ చేశాడు. కానీ స్రష్టి మాత్రం నాయకుడు రిస్క్ తీసుకోవడం నచ్చలేదని కౌంటర్ ఇచ్చింది. 

షాలిని రాంప్రసాద్ పై సీరియస్ అయ్యింది. ఎంటర్ టైన్మెంట్ ముసుగులో గొడవలు పెడుతున్నావ్. నాకు యాటిట్యూడ్ ఎక్కువ అన్నావంటూ నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇంతలో రోహిత్, చరణ్ త్రిగుణ్ పై ఫైర్ అయ్యారు. నువ్వు తొక్కలో అగ్నిపరీక్ష అన్నావ్. అందుకే రియాక్ట్ అయ్యాం. మళ్లీ తప్పు కాదంటావా అని రోహిత్ ప్రశ్నించాడు. నువ్వు ప్రౌడ్ గా వచ్చావ్, కానీ మేము టీమ్ సెలెక్ట్ చేస్తే వచ్చామంటూ రాంప్రసాద్ చరణ్ ని తక్కువ చేసి మాట్లాడాడు.

ఆ తర్వాత చరణ్ కి కృష్ణుడు రంగుపూసి నామినేట్ చేశాడు. చరణ్ ని నామినేట్ చేస్తూ కృష్ణుడు తన అభిప్రాయం చెప్పాడు. ఇక్కడికి ఒంటరిగా ఆడటానికి వచ్చాం, గ్రూప్ గా కాదని.. ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలంటూ హితబోధ చేశాడు.చరణ్ కి అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అయిన షాలిని అమన్ శ్రష్టి, రోహిత్ మాత్రమే సపోర్ట్ చేశారు. తన టీమ్ లో వాళ్ళు అయినా వంశీ, జాన్సీ కూడా చరణ్ కి సపోర్ట్ చెయ్యలేదు. చివర్లో త్రిగుణ్ .. తొక్కలో అగ్నిపరీక్ష అన్న కామెంట్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. వీకెండ్ లో నాగార్జున వచ్చి దీనిపై త్రిగుణ్ కి క్లాస్ పీకడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com