Home

»

Tv News

బుల్లితెరకు దూరంగా లాస్య.. ఇప్పుడు ఎక్కడుందంటే.!

Sep 11, 2026 10:03AM


ఒకప్పుడు బుల్లితెరను ఏలిన టాప్ యాంకర్ లాస్య మంజునాథ్.. ఇప్పుడు కనిపించడం లేదు. Something Special షోతో, ఆ తర్వాత Bigg Boss 4 తెలుగులోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న లాస్య, గత కొంతకాలంగా ఏ టీవీ షోలోనూ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు లాస్య ఎక్కడ ఉంది. ఎందుకు బ్రేక్ తీసుకుందనే విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ తర్వాత లాస్య టీవీ షోలకు దూరమైంది. పెద్ద ఛానల్స్ లో యాంకరింగ్ చేయడం మానేసి, తన సొంత యూట్యూబ్ ఛానల్ 'Lasya Talks' పైనే ఫోకస్ పెట్టింది. Instagram, YouTube లో ఫ్యామిలీ వ్లాగ్స్, ఫుడ్, ట్రావెల్, బేబీ కేర్, మేకప్ వీడియోలతో యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం లాస్యకు ప్రధాన ఆదాయ వనరు సోషల్ మీడియానే అని తెలుస్తోంది.

అసలు లాస్య క్రేజ్ తగ్గడానికి కారణం ఆఫర్స్ లేకపోవడమే అంటున్నారు. కెరీర్ లో వెనకబడుతున్న సమయంలో ఆఫర్స్ తగ్గిపోవడంతోనే లాస్య Bigg Boss 4 కి వెళ్లింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే మళ్లీ క్రేజ్ వస్తుందని భావించింది. కానీ బిగ్ బాస్ లో కూడా ఆమె ఊహించినంత క్రేజ్ దక్కించుకోలేకపోయింది. అక్కడ కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో ఆ తర్వాత కూడా ఆమెకు భారీ షోలు రాలేదు, క్రేజ్ మరింత తగ్గిపోయింది.

గతంలో లాస్య రెండోసారి ప్రెగ్నెంట్ అనే న్యూస్ తో వచ్చింది. ఫస్ట్ ట్రైమిస్టర్ వల్ల హెల్త్ బాగోలేక రెండు నెలలు సోషల్ మీడియాకు దూరమైంది. అప్పుడు భర్త మంజునాథ్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోను 'Get Well Soon' అంటూ షేర్ చేయడంతో అభిమానులు కంగారు పడ్డారు. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్, పిల్లలతోనే ఎక్కువ టైమ్ గడుపుతూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కొనసాగుతోంది లాస్య.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com