Home

»

Tv News

డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్.. డేంజర్ జోన్ లోకి చైత్ర!

Sep 11, 2026 9:30AM

బిగ్ బాస్ సీజన్ -10 లో ఇప్పుడు ఎలిమినేషన్ టెన్షన్ పీక్స్ కి చేరింది. ఇవాళ  చరణ్ ఎలిమినేట్ కాగా వీకెండ్ ఎపిసోడ్ లో మరో ఎలిమినేషన్ జరగబోతోందని ప్రోమోలు, సోషల్ మీడియా అప్డేట్స్ హాట్ గా మారాయి. డబుల్ ఎలిమిమేషన్.. ఆర్ ట్రిపుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. ఒక ఎలిమినేషన్ అనుకున్న సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇందులో చైత్ర పేరు కూడా డేంజర్ జోన్ లో వినిపిస్తోంది. వంశీతో కలిసి ఎమోషనల్ స్కిట్ తో మెప్పించినా ఓటింగ్ లో వెనుకబడినట్టు టాక్ వస్తోంది.  ఎవరు సేఫ్ అవుతారు.. ఎవరి జర్నీ ఇక్కడితో ముగుస్తుందంటూ ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. గత వారం చరణ్ మిడ్ వీక్ లో వెళ్లిపోగా ఈ వారం మరో షాక్ తప్పదని అంటున్నారు నెటిజన్స్.

బిగ్ బాస్ అసలు ట్విస్ట్ ఏంటో వీకెండ్ లో నాగార్జున క్లారిటీ ఇవ్వనున్నారు. డబుల్ ఎలిమినేషన్ అవుతుందా.. లేక ట్రిపుల్ ఎలిమినేషన్ తో అందరికి షాక్ ఇస్తాడా అనేది చూడాలి. చైత్ర ఫ్యాన్స్ మాత్రం .. ఆమె ఆట, ఎమోషన్స్ చూసి సేవ్ చేయండి అంటూ ఓటింగ్ కి పిలుపునిస్తున్నారు.

చరణ్ ఫస్ట్ ఎలిమినేషన్ కాగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే చైత్ర, ఒకవేళ ట్రిపుల్ ఎలిమినేషన్ అయితే సుధీర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతనికి స్క్రీన్ స్పేస్ లేదు. ఏ టాస్క్ లోను యాక్టివ్ గా లేడు.. ముఖ్యంగా గొడవల్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ఇంకా ఓటింగ్ కూడా పెద్దగా లేదు. ప్రస్తుతానికి చైత్ర, సుధీర్ డేంజర్ జోన్ లో ఉన్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com