Home

»

Tv News

బిగ్ బాస్ సీజన్-10 సుధీర్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Sep 11, 2026 9:56AM


తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss Telugu?) ఈ సీజన్-10 గత ఆదివారం స్టార్ట్ అయింది. నాగార్జున హోస్ట్ గా దశావతారం కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్ లో నాల్గవ కంటెస్టెంట్ గా డిజిటల్ యాంకర్ సుధీర్ రెడ్డి హౌస్ లోకి అడుగుపెట్టాడు. సెప్టెంబర్ 6న జరిగిన గ్రాండ్ లాంఛ్ లో ఆయన ఎంట్రీ అందరిని ఆకట్టుకుంది.

సుధీర్ రెడ్డి ఎవరంటే.. ఆదాన్ మీడియా, 'సుధీర్ టాక్స్' అనే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఫేమస్ అయిన యాంకర్. సెలబ్రిటీలు, బిజినెస్ మెన్ లను బోల్డ్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. రాయలసీమ కుర్రాడైన సుధీర్, ట్రావెల్ వ్లాగ్స్, ఫిజిక్ కోచ్ గా కూడా పాపులర్.

అయితే సుధీర్ లైఫ్ జర్నీ అంత ఈజీ కాదు. కాలేజ్ లో చదువులో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. సింగపూర్ వెళ్లి చెఫ్ గా సెటిల్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ అక్కడ ఫ్రెండ్ మోసం చేయడంతో చేతిలో కేవలం 100 డాలర్లతో హౌస్ కీపింగ్ పనులు చేస్తూ.. తినడానికి తిండి లేక గురుద్వారాకు వెళ్లి భోజనం చేసే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి ఇండియా వచ్చి డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

లైఫ్ లో కష్టాలు, ఒత్తిడి వల్ల ఒకానొక దశలో బరువు వంద కేజీలకు పెరిగిపోయాడు. కానీ పట్టుదలతో కేవలం 3 నెలల్లో 22 కేజీలు తగ్గి 78 కేజీలకు వచ్చి ట్రాన్స్ ఫర్మేషన్ తో అందరికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. హౌస్ లోకి వెళ్లే ముందు హీరోయిన్ అనుష్క తన బిగ్గెస్ట్ క్రష్ అని చెప్పి నాగార్జునను కూడా నవ్వించాడు. ఇప్పుడు హౌస్ లో మోడల్ స్రష్టితో లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com