Home

»

Tv News

రోహిత్ కి కళ్లు నెత్తికెక్కాయ్.. వర్షిణి, త్రిగుణ్ ఫైర్!

Sep 10, 2026 2:11PM

బిగ్ బాస్ సీజన్-10 హౌస్ లో బ్లూ టీమ్, రెడ్ టీమ్ మధ్య పని విషయంలో పెద్ద గొడవే జరిగింది.  పనులన్నీ ఒక టీం చేయాలని ఇంకో టీమ్ మానిటరింగ్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో రెండు టీమ్స్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. రెడ్ టీమ్ పని చేస్తుండగా బ్లూ టీమ్ మానిటరింగ్ చేసింది.

ఈ క్రమంలో రోహిత్ తీరుపై వర్షిణి, కృష్ణుడు, త్రిగుణ్ విడిగా చర్చించుకున్నారు. రోహిత్ ప్రొఫెసర్ అనుకుంటున్నాడు,.. కళ్లు నెత్తికెక్కాయి, పెద్ద తోపులా ఫీల్ అవుతున్నాడని వర్షిణి ఫైర్ అయింది. ఎవరు 'కీ' ఇస్తున్నారో తెలీదు కానీ మీద మీదకు వస్తున్నాడని కృష్ణుడు అనగా వీళ్లని యూజ్ చేసుకుని తొక్కుకుని పైకి రావాలని చూస్తున్నాడని త్రిగుణ్ కామెంట్ చేశాడు.

ఆ తర్వాత కిచెన్ డిపార్ట్మెంట్ లో రోహిత్, త్రిగుణ్ మధ్య డైరెక్ట్ వార్ జరిగింది. డిష్ వాష్ టీమ్ ని పిలవమని త్రిగుణ్ చెప్తే ముప్పై సెకన్స్ అని రోహిత్ అన్నాడు. మీరు ఎప్పుడూ టైమ్ అడుగుతూనే ఉంటారు.. స్క్రాప్ మాట్లాడుతారు. ఆ తర్వాత కిచెన్ లో గిన్నెలు తోమడానికి రోహిత్ సిద్దమవుతాడు. ఇక నీట్ గా ఉండాలి..‌ఒక ఆర్డర్ గా వెళ్ళాలని త్రిగుణ్ అనగా రోహిత్ ఏదో చెప్తుంటాడు. దాంతో ఇరిటేట్ ఫీల్ అయిన త్రిగుణ్.. పాయింట్ కి రండి అని అంటాడు. మీరు స్క్రిప్ట్ లు రాసుకుంటున్నారని రోహిత్ కౌంటర్ వేశాడు. నిన్ను పెట్టుకుని రాసేంత బొమ్మ నీకు లేదు..ముందు పని చేయవయ్యా అని త్రిగుణ్ వెటకారంగా మాట్లాడి వెళ్లిపోయాడు. అగ్నిపరీక్షలో ఫుల్ పాజిటివిటీతో ఉన్న రోహిత్.. హౌస్ లోకి వచ్చాక ఓవర్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడని హౌస్ మెంబర్స్ భావిస్తున్నారు. రోహిత్ వర్సెస్ త్రిగుణ్, వర్షిణి వార్ తో సెప్టెంబర్ 9 ఎపిసోడ్ రసవత్తరంగా మారింది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com