Home

»

Tv News

Bigg Boss Telugu 10: మాస్టర్-పప్పెట్ టాస్క్‌లో వర్షిణి తప్పు.. షాలినీకి క్లాస్ పీకిన  నాగార్జున!

Sep 20, 2026 12:45PM

బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం హౌస్ మేట్స్ ని నాగార్జున ఒక ఆట ఆడుకున్నాడు. ఆటల్లో కంటెస్టెంట్లు చేసిన తప్పుల్ని చూపిస్తూ క్లాస్ పీకాడు. వంటగదిలో వంశీ అరవడం, షాలినీ మీదమీదకు వెళ్లడం, వర్షిణి టచ్ చేయడం.. రోహిత్ ఆటతీరు ఇలా ప్రతీ ఒక్క విషయంలో నాగార్జున అందరి మీద ఫైర్ అయ్యాడు. ఇక అసలు ఈ వారంలో ఒక్క చోట కూడా కనిపించలేదని కృష్ణుడు, శ్రష్టిని వేరే చోట కూర్చోబెట్టాడు నాగార్జున. 

హౌస్ లోని ఒక్కో కంటెస్టెంట్ వచ్చి.. ఎవరు మాస్టర్, ఎవరు పప్పెట్ చెప్పి తగిన కారణాలు చెప్పాలని నాగార్జున చెప్తాడు. వర్షిణి వచ్చి రోహిత్ మాస్టర్ అని చరణ్ పప్పెట్ అని అంటుంది. సంచాలక్‌గా వర్షిణి చేసిన తీరుని నాగార్జున ప్రశ్నిస్తాడు. వంశీ అంత బాగా పాయింట్ చెప్తుంటే ఎందుకు వినలేదు..  రోహిత్ పాయింట్ మాత్రం ఎలా విన్నావని అంటాడు. ముఖేష్‌కి ఫేవర్‌గా చెప్పాను కాబట్టి నా మాట విన్నదని రోహిత్ అంటాడు. సంఛాలక్‌గా వర్షిణి ఫెయిల్ అని ముఖేష్ కోసం నిర్ణయం తీసుకుందని ఆడియన్స్ కూడా చెప్తారు. దీంతో ఇకపై ఈ సీజన్‌లో ఉన్నంత వరకు సంచాలక్‌గా పెట్టమని వర్షిణికి పనిష్మెంట్ ఇస్తాడు నాగార్జున.

షాలినీ అలా మీద మీదకు వెళ్లడం తప్పు.. అక్కడ వర్షిణి నిన్ను తోయలేదు.. టచ్ చేసింది.. నువ్వే మీద మీదకు వెళ్తున్నావ్.. నీదే తప్పు అని ఆడియన్స్ కూడా అంటున్నారు.. నువ్వు చేసిందే రైట్ అని అనుకోవద్దు.. నువ్వు చేసిందే ఎదుటి వాళ్లు నీకు చేస్తే నువ్వు తట్టుకోలేవు.. నీకుండే హక్కులే.. అందరికీ ఉంటాయని గుర్తు పెట్టుకో.. అమన్ చెప్పినట్టు.. యాంగర్ మేనేజ్మెంట్ చేసుకో.. అక్కడ అమన్ పాయింట్ చెప్తూ ఉంటే కూడా మధ్యలోకి దూరావ్.. నువ్వు అక్కడ బ్లాక్స్ కూడా సరిగ్గా పెట్టలేదు.. తప్పు నీ వైపు ఉంది.. కానీ నువ్వు మాత్రం మీద మీదకు వెళ్తున్నావ్ అని నాగార్జున తిడుతుంటాడు. దీంతో షాలినీకి ఏడుపొస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది. షాలినీకి డిష్ వాష్ పనిష్మెంట్ ఇద్దామని ఝాన్సీ అంటుంది. ఏంటి ముఖేష్‌కి ఫేవర్‌గా తీసుకున్నావా అని ఝాన్సీతో నాగార్జున అంటాడు.అదేం లేదు సర్ అని ఝన్సీ అంటుంది. ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో ముఖేష్, షాలినీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, దేబ్జానీ సేఫ్ అయ్యారు. మరి  నిన్నటి ఎపిసోడ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

 

 

[Bigg Boss Telugu 10 weekend episode, Bigg Boss 10 Telugu Varshini punishment Sanchalak, Bigg Boss Telugu 10 Shalini vs Varshini fight, Bigg Boss Telugu 10 Master Puppet task, Bigg Boss Telugu 10 Nagarjuna fire on contestants]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com