Home

»

Tv News

Bigg Boss 10 Telugu : యాక్టివ్ గా లేని శ్రిష్టి, కృష్ణుడికి పనిష్మెంట్.. రోహిత్ కు నాగార్జున వార్నింగ్!

Sep 20, 2026 12:32PM

బిగ్ బాస్ తెలుగు 10 రెండో వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్ల ఆటతీరుపై గట్టిగా స్పందించారు. 15 మంది కంటెస్టెంట్లలో శ్రిష్టి, కృష్ణుడు యాక్టివ్‌గా కనిపించడం లేదని వారి వీడియోలను చూపించి ఇద్దరికీ పనిష్మెంట్ ఇచ్చాడు. అనంతరం రామ్ ప్రసాద్, త్రిగుణ్‌లతో సరదాగా మాట్లాడిన నాగార్జున, మాస్టర్–పప్పెట్ టాస్క్‌లో చరణ్, రామ్ ప్రసాద్, వర్షిణి తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించాడు. సంఛాలక్‌గా రామ్ ప్రసాద్ వ్యవహరించిన తీరును తప్పుబట్టడంతో పాటు, ఇంట్లో పగటిపూట నిద్రపోతున్న కంటెస్టెంట్లకు కూడా పనిష్మెంట్ విధించాడు.

ఆ తర్వాత వర్షిణి సంఛాలక్‌గా తీసుకున్న నిర్ణయంపై నాగార్జున ప్రశ్నించాడు. రోహిత్ చెప్పిన మాటకు ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకున్నట్టు కనిపించడంతో ఇకపై వర్షిణిని సంఛాలక్‌గా పెట్టబోమని పనిష్మెంట్ ఇచ్చాడు. అనంతరం షాలినీ–వర్షిణి మధ్య జరిగిన గొడవను ప్రస్తావించిన నాగార్జున, షాలినీ దూకుడుగా వ్యవహరించిందని చెప్పారు. కోపాన్ని నియంత్రించుకోవాలని, ఎదుటివారికి కూడా తనకున్న హక్కులే ఉంటాయని గుర్తుంచుకోవాలని సూచించారు. దీంతో షాలినీ తీవ్రంగా భావోద్వేగానికి గురైంది. ఇక దేబ్జానీ ఫుడ్ మానిటర్‌గా వ్యవహరించిన తీరును కూడా నాగ్ ప్రశ్నించగా, వంశీకి వంట చేసేటప్పుడు కోపంగా కాకుండా ప్రేమగా చేయాలని సూచించారు.

చివరగా రోహిత్ ఆటతీరుపై నాగార్జున ఫైర్ అయ్యాడు. టాస్క్‌లో ఒకరిని ఎత్తి పడేయడం, త్రిగుణ్ రెచ్చగొట్టడంతో తాను కూడా రెచ్చిపోవడం సరికాదని చెప్పాడు. ఎవరైనా రెచ్చగొట్టిన వెంటనే స్పందిస్తే ఆట దెబ్బతింటుందని సూచిస్తూ..‌నీ పేరులోనే హిట్ ఉంది.. ఆట బాగుంది.. కానీ ఆట తీరు మార్చుకోమంటూ రోహిత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అనంతరం షాలినీ సేఫ్ అయినట్లు ప్రకటించడంతో శనివారం నాటి వీకెండ్ ఎపిసోడ్ ముగిసింది.

 

 

[Bigg Boss Telugu 10 weekend episode, Bigg Boss 10 Telugu September 20 Nagarjuna, Bigg Boss Telugu 10 Srishti Krishnudu punishment, Bigg Boss Telugu 10 Varshini Sanchalak decision, Bigg Boss Telugu 10 Rohit warning Shalini safe]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com