బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో రెండో వారం పూర్తిగా గొడవలు, ఫిజికల్ టాస్కులు, గ్రూప్ గేమ్‌తో హీటెక్కిపోయింది. కెప్టెన్సీ, రేషన్ టాస్కుల్లో కంటెస్టెంట్లు హద్దులు దాటి ఒకరిపై ఒకరు పడ్డారు. రోహిత్ మీద త్రిగుణ్, ముఖేష్, వర్షిణి మీద షాలినీ, వర్షిణి చెప్పినట్టు సుధీర్ వింటున్నాడు అనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి టైంలో కొంతమంది మాత్రం అసలు గేమ్‌లోకి రాకుండా వెకేషన్‌కి వచ్చినట్టు చిల్ మోడ్‌లో ఉన్నారు. అందులో ముందు వరుసలో సీనియర్ నటుడు కృష్ణుడు ఉన్నాడు. రెండో వారంలో కృష్ణుడు నుంచి అక్షరాలా జీరో ఫుటేజ్ వచ్చింది, ఏ చర్చలోనూ లేడు, ఏ టాస్కులోనూ కనిపించలేదు. అతనితో పాటు శ్రిష్టి కూడా ఎక్కడా యాక్టివ్ గా లేదు. దాంతో నాగార్జున వీరిద్దరిపై సీరియస్‌గా ఫైర్ అయ్యాడు.
మీరు ఆటలో సవాల్‌గా లేరు, ఆటే సవాల్ అని చెప్తే మీరు ఆడియన్స్‌లా ఒక చోట కూర్చుని చూస్తున్నారు. ఇప్పుడు కూడా వెళ్లి సైడ్‌కి కూర్చోండి అంటూ స్టేజ్ పక్కన కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత హౌస్‌లో ఎవరు మాస్టర్, ఎవరు పప్పెట్ అని తేల్చే ఇంట్రెస్టింగ్ టాస్క్ పెట్టారు. ఒక్కొక్కరు వచ్చి తమ అభిప్రాయం చెప్పాలని అన్నారు. చరణ్ వచ్చి వర్షిణి మాస్టర్, సుధీర్ పప్పెట్ అని చెప్పాడు. అయితే మోస్ట్ ఆఫ్ ది హౌస్ మేట్స్ మాత్రం త్రిగుణ్ ని మాస్టర్ గా చెప్పారు. రామ్ ప్రసాద్, దేబ్జానీ కూడా త్రిగుణ్ తన అభిప్రాయాలను వంశీ మీద రుద్దుతున్నాడు. వంశీ అతని మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడని ఓపెన్ గా చెప్పేశారు.
ఆడియన్స్ రియాక్షన్ కూడా అదే రేంజ్ లో ఉంది. నిజంగానే టెంపర్ వంశీ వెనుక త్రిగుణ్ హ్యాండ్ ఉందని, వంశీ కిచెన్ లో గొడవపడినా, బ్లాక్స్ టాస్కులో అరిచినా అదంతా త్రిగుణ్ స్క్రిప్టే అని ఆడియన్స్ అన్నారు. కానీ వంశీ క్యారెక్టర్ అది కాదని ఫస్ట్ వీక్ లోనే అర్థం అయింది. హౌస్ లో అమ్మ లేని లోటుని తీరుస్తున్నాడని హౌస్ మేట్స్ అంతా టెంపర్ వంశీకి ఓటేశారు. అయితే ఆ డిస్కషన్ లో దేబ్జానీది తప్పు అని తేలింది. దేబ్జానీ కోసం కేటాయించిన వెజ్ రైస్ లో నుండి చిన్న కప్ తను త్యాగం చేసి ఇచ్చిందని అందరి ముందు చెప్పింది కానీ అక్కడ కిచెన్ లో వంట చేసే త్రిగుణ్, వంశీలకి చెప్పకపోవడంతో అక్కడ పెద్ద గొడవ జరిగిందని నాగార్జున చెప్పాడు.
[Bigg Boss Telugu 10 Day 13, Nagarjuna fires on Krishnudu Srishti punishment,Vamshi puppet Thrigun master Bigg Boss 10,Bigg Boss Telugu 10 weekend episode master puppet task, Bigg Boss Telugu 10 audience reaction Vamshi Thrigun]




