Home

»

Tv News

Jayam serial: స్పాన్సర్‌షిప్ క్యాన్సిల్ చేసి జయకు ఇచ్చిన విశ్వ.. గంగకు అండగా రుద్ర!

Sep 20, 2026 12:13PM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-378 లో.. గంగ, రంగా కూరగాయలు తీసుకొని రోడ్డుపై నడుచుకుంటు వస్తుంటే కార్ లో బాక్సింగ్ స్పాన్సర్స్ చూసి గంగ దగ్గరికి వస్తారు. నీ స్పాన్సర్‌షిప్ క్యాన్సిల్ చేసి విశ్వ సర్ వాళ్ళ కూతురు జయకి ఇస్తున్నాం.. సర్ జయకి కోచింగ్ ఇస్తాడంట అని‌ వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. ఇక నిజం కనుక్కోవాలని , తన తప్పేం లేదని చెప్పడానికి విశ్వ ఇంటికి బయల్దేరి వెళ్తుంది. రంగా వద్దని ఎంత చెప్పినా వినదు. అదే సమయంలో హాల్లోకి రుద్ర, పెద్దసారు వస్తారు. గంగా కాఫీ తీసుకొని రా అని పెద్దసారు చెప్పగానే కాసేపటికి శకుంతల తీసుకొని వస్తుంది.

ఏంటి నువ్వు తెచ్చావ్.. గంగ ఎక్కడ అని పెద్దసారు అడుగగానే రంగా, గంగ కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారని శకుంతల చెప్తుంది. ఇంట్లో ఇంతమంది ఉండగా గంగనే ఎందుకు పంపించావని పెద్దసారు అడుగగా స్పాన్సర్‌షిప్ క్యాన్సిల్ అయింది.. ఆ విశ్వ ట్రైనింగ్ ఇవ్వడు.‌.. గంగ అరకొరగా ప్రాక్టీస్ చేస్తుంది.. పోటీలో పాల్గొన్నా గెలవదని శకుంతల అనగానే అలా ఎందుకంటావని పెద్దసారు అంటాడు. మీకేం తెలియదు ఊరుకోండి అని శకుంతల అంటుంది. మరోవైపు గంగ , రంగా విశ్వ దగ్గరికి వెళ్తారు. సర్ నాకు ట్రైనింగ్ ఇవ్వనని చెప్పారా.. ఆ రోజు జరిగిన దాంట్లో నా తప్పేం లేదని.. పాలల్లో ఎవరో నిద్రమాత్రలు కలిపారని గంగ చెప్తుంది. ఎనఫ్.. చాలు ఆపు.. డిసిప్లేన్ లేనివాళ్ళకి మాట్లాడే అర్హత లేదు.. టైమ్ చాలా విలువైనది అంటు గంగకి క్లాస్ పీకుతాడు విశ్వ. నేను నీకు ట్రైనింగ్ ఇవ్వను.. నా కూతురు జయకే ఇస్తాను.. తనే ఈ సారి ఛాంపియన్ అని విశ్వ అంటాడు.

ఇక గంగా తన తప్పేం లేదని చెప్పే ప్రయత్నం చేసినా విశ్వ వినకుండా గెటవుట్ అనేసి వెళ్ళిపోతాడు. దాంతో గంగా ఏడుస్తూ బయటకు వస్తుంది. రంగా ఎంత చెప్పినా వినకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. రంగా వెంటనే రుద్రకి కాల్ చేస్తాడు. మరోవైపు రుద్ర కార్ లో అకాడమీకి వెళ్తుంటాడు. ఇక రంగా కాల్ చేసి.. ‌జరిగిందంతా చెప్తాడు. కాసేపటికి గంగని వెతుక్కుంటూ రుద్ర, రంగా వెళ్తారు. గంగ ఒక గుడికి వెళ్ళి ఏడుస్తూ అమ్మవారిని మొక్కుకుంటుంది. తనేం తప్పు చేశానంటు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఒక తాడుతో తనని తాను కొట్టుకుంటుంది. అప్పుడే రుద్ర వచ్చి గంగని ఆపుతాడు. ఎందుకు ఈ పిచ్చిపని అని రుద్ర అనగానే విశ్వ సర్ నాకు కోచింగ్ ఇవ్వనని చెప్పేశాడు.. ఎందుకుండాలని గంగ అనగానే నేను కోచింగ్ ఇస్తాను.. నువ్వు గెలుస్తావని రుద్ర అనగానే గంగ దండం పెడుతుంది. అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Jayam today episode 378, Zee Telugu Jayam September 20 episode, Jayam Ganga sponsorship cancelled Vishwa Jaya, Jayam Ganga self punishment temple twist, Jayam Rudra supports Ganga coaching]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com