Bigg Boss 10 Telugu: వర్షిణి మొహాన కాఫీ కొట్టిన సుధీర్.. బిబి కేఫ్ నామినేషన్స్!
Nov 24, 2026 8:19AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో 12వ వారం నామినేషన్స్‌తో హౌస్ మొత్తం హీటెక్కిపోయింది. ఇక మిగిలింది నాలుగు వారాలే.. ఫినాలే దగ్గర పడుతుండటంతో ఎవరి గేమ్ వాళ్లు ఆడాలని బిగ్ బాస్ చెప్పేశాడు. గ్రూపులు, అలియన్స్‌లకు స్వస్తి చెప్పి వ్యక్తిగతంగా నిలబడాల్సిన టైమ్ వచ్చేసింది. ఈ వారం కెప్టెన్‌గా ఉన్న అమన్ నామినేషన్స్ నుంచి సేఫ్‌గా ఉండగా.. మిగిలిన ఏడుగురు నామినేషన్స్‌లో నిలిచారు. వర్షిణి, వంశీ, దేబ్జానీ, రామకృష్ణ, రామ్ ప్రసాద్, ముఖేష్, త్రిగుణ్.. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న టెన్షన్ ఇప్పటి నుంచే మొదలైంది.
ఈ వారం బిబి కేఫ్ నామినేషన్స్ గా చెప్పాడు బిగ్ బాస్. అందులో కెప్టెన్ అమన్ ఒక్కొక్కరికి విఐపి పాస్ ఇస్తాడు. వారు మాత్రమే నామినేషన్ చేయాలి.. ఒక్కొక్కరు ఒక్కొక్కరినే నామినేషన్ చేయాలి.. ఒకసారి నామినేషన్ చేసిన వాళ్ళని మరొకరు నామినేషన్ చేయడానికి వీల్లేదని బిగ్ బాస్ చెప్పాడు. ఇక నామినేషన్స్‌లో వర్షిణి వర్సెస్ సుధీర్ ఫైట్ జరిగింది. రివార్డ్ రివేంజ్ టాస్క్‌లో వర్షిణి వ్యవహరించిన తీరును లేవనెత్తాడు సుధీర్. నువ్వు, శ్వేత కలిసి బాల్స్ వేస్తున్నారని భావించే వాళ్లకు ఇచ్చానని వర్షిణి వివరణ ఇచ్చింది. ముఖేష్‌కు సపోర్ట్ లభిస్తుందనే ఆ రోజు నాకు కావాలని సపోర్ట్ చేయలేదని రామ్ ప్రసాద్ కూడా ఆరోపించాడు. దాన్ని వర్షిణి ఖండించింది. సంఛాలక్ గా రోహిత్ ఉన్నప్పుడు తను సాయం చేస్తే తప్పు లేదని వాదించింది. నన్ను చూడు.. నాతో మాట్లాడు అంటూ పట్టుబట్టింది. తప్పు చేశావా లేదా చెప్పు అంటే ఇతరుల పేర్లు చెప్తున్నావని సుధీర్ నిలదీశాడు. నీకు ఎందుకు చెప్పాలి బై అంటూ సుధీర్ తో వర్షిణి అంది. నువ్వు నీ గురించి కాకుండా పక్కవాళ్ల గురించి ఆడుతున్నావని సుధీర్ విమర్శించాడు. చివరకు కోపంలో వర్షిణి మొహాన కాఫీ కొట్టి నామినేట్ చేశాడు సుధీర్.
ఆ షాకింగ్ మూమెంట్‌తో హౌస్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇది నామినేషన్ ప్రక్రియలో భాగమే అయినా.. మొహాన కాఫీ కొట్టడం కరెక్టేనా? అని ఫ్యాన్స్‌లో పెద్ద డిబేట్ మొదలైంది. వర్షిణి కూడా కన్నీళ్లతో ఎమోషనల్ అయ్యింది.మరోవైపు దేబ్జానీ రామ్ ప్రసాద్‌ను నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్సీ తనకు ఎంత ముఖ్యమో తెలిసినా ఆ రోజు రామ్ ప్రసాద్ తనకు సపోర్ట్ చేయలేదని దేబ్జానీ కారణం చెప్పింది. శివ్ త్రిగుణ్‌ను, ముకేష్, నరేష్‌లు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ పాత విషయాలన్నీ తవ్వి తీశారు. మొత్తానికి 12వ వారం నామినేషన్స్ గ్రూపులని విభజించాయి. ఇక ఫినాలే రేసులో ఎవరు నిలబడతారో చూడాలి మరి.




.webp)