BiggBoss 10 Telugu: మొదట తిట్టుకుంటూ పాట, మళ్లీ పొగుడుతూ అదే పాడించుకున్నా.. మోస్ట్ వైరల్ రీల్!
Nov 24, 2026 8:30AM
.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో అపూర్వ, త్రిగుణ్ మధ్య జరిగిన సాంగ్ వార్ ఇప్పుడు బయట కూడా హాట్ టాపిక్ అయ్యింది. త్రిగుణ్ గురించి అపూర్వ తాజాగా పెట్టిన పోస్ట్‌తో ఈ మొత్తం స్టోరీకి క్లారిటీ వచ్చింది. మొదటగా హౌస్‌లో ఉన్నప్పుడు త్రిగుణ్ అపూర్వను వెక్కిరిస్తూ ఒక పాట పాడాడు. ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. అపూర్వను టార్గెట్ చేస్తూ "పని దొంగా" అంటూ ట్యూన్‌లో త్రిగుణ్ పాడిన ఆ పాట హౌస్‌లో పెద్ద గొడవకు దారి తీసింది.
అయితే సెకండ్ టైమ్ సీన్ రివర్స్ అయ్యింది. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన అపూర్వ, డిక్టేటర్ నామినేషన్ కోసం మళ్ళీ హౌస్‌లోకి వెళ్లినప్పుడు అదే త్రిగుణ్ తో తనను పొగుడుతూ పాట పాడించుకుంది. "ఏ నోటితో అయితే నన్ను వెక్కిరిస్తూ పాట పాడారో, అదే నోటితో నన్ను పొగుడుతూ పాట పాడించుకున్నాను... ఆ ట్యూన్‌కే నేను డాన్స్ చేశాను!" అని అపూర్వ తన ఇన్‌స్టా పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. It was our mutual understanding అని, అందులో భాగంగానే చాలా మంది కంటెస్టెంట్స్‌ను తాను బ్రూటల్‌గా ఎక్స్‌పోజ్ చేశానని పేర్కొంది.
ఈ రెండు సందర్భాల్లో ఒకే ట్యూన్ ఉండటం, కానీ మాటలు మాత్రం పూర్తిగా మారిపోవడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. మొదట తిట్టిన నోటితోనే పొగిడించడం అపూర్వ గేమ్ స్ట్రాటజీకి నిదర్శనమని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. త్రిగుణ్ కూడా అపూర్వ చెప్పినట్లుగానే ఆ ట్యూన్‌కు పొగుడుతూ పాట పాడటం, అపూర్వ దానికి డ్యాన్స్ చేయడం హౌస్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ హౌస్‌లో శత్రువులు కూడా పరిస్థితులను బట్టి ఫ్రెండ్స్ అవుతారని ఈ ఘటన మరోసారి నిరూపించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. త్రిగుణ్, అపూర్వ మధ్య ఉన్న ఈ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ గేమ్‌లో భాగమే అయినా, ఒకరినొకరు ఎలా హ్యాండిల్ చేశారో చూడటం ఆసక్తికరంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.




.webp)