TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Bigg Boss 10 Telugu : బిబి కేఫ్ నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్.. ఎవరెవరు ఉన్నారంటే!

Nov 24, 2026 8:13AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో 12వ వారం నామినేషన్స్ భిన్నంగా సాగాయి. బిగ్ బాస్ సీజన్-10 దశావతారంలో భాగంగా ఈ వారం బడ్డీ అప్ థీమ్‌తో కొత్త గేమ్ మొదలైంది. ఇక మిగిలింది నాలుగు వారాలే అని నాగార్జున చెప్పడంతో కంటెస్టెంట్లలో టెన్షన్ డబుల్ అయ్యింది. ఈ వారం కెప్టెన్‌గా అమన్ ఉండటంతో అతను నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. మిగిలిన ఏడుగురు.. వర్షిణి, టెంపర్ వంశీ, దేబ్జానీ, రామకృష్ణ, రామ్ ప్రసాద్, ముఖేష్, త్రిగుణ్ నామినేషన్స్‌లో నిలిచారు. నరేష్, శివ్, సుధీర్ ఈ వారం సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు.

ఈ నామినేషన్స్‌లో అత్యంత హాట్ టాపిక్ వంశీ డైరెక్ట్ నామినేషన్. గత వీకెండ్‌లో వర్షిణిపై వంశీ చేసిన అసభ్య వ్యాఖ్యలను నాగార్జున స్టేజ్ మీదే ప్లే చేసి గట్టిగా క్లాస్ పీకాడు. సినీ కుటుంబం నుంచి వచ్చి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని అన్నాడు. వంశీ తప్పు ఒప్పుకొని వర్షిణికి, నాగార్జునకి క్షమాపణ చెప్పాడు. అయినా అది చాలదని త్రిగుణ్ సలహా మేరకు వంశీని డైరెక్ట్‌గా నామినేట్ చేశాడు నాగార్జున. అదే సమయంలో డిక్టేటర్లుగా త్రిగుణ్‌కు 90 మార్కులు, ముఖేష్‌కు కేవలం 50 మార్కులు వచ్చాయని కూడా తేలింది. వర్షిణి ముఖేష్‌కు 90 ఇస్తే.. రామ్ ప్రసాద్ కేవలం 30 మాత్రమే ఇచ్చాడు.

మరోవైపు నామినేషన్స్‌లో త్రిగుణ్ వర్సెస్ ముఖేష్ మళ్లీ మాస్ ఫైట్‌లా మారింది. త్రిగుణ్ వర్షిణిని ఫ్రెండ్‌షిప్‌కు ద్రోహం చేసిందని, ముఖేష్‌ను అసభ్యంగా మాట్లాడాడని నామినేట్ చేశాడు. ముఖేష్ కూడా త్రిగుణ్‌ను సొసైటీకి ఇంజూరియస్ అని, రోహిత్ కలను నెరవేరుస్తానని సవాల్ విసిరాడు.  రామ్ ప్రసాద్‌ను దేబ్జానీ, వర్షిణిని సుధీర్, దేబ్జానీని నరేశ్ నామినేట్ చేస్తూ పాత రివార్డ్ రివేంజ్ టాస్క్ విషయాలన్నీ బయటకు తీశారు. త్రిగుణ్‌ను టార్గెట్ చేస్తూ శివ్ నామినేషన్ చేశాడు. ఆర్కేని త్రిగుణ్ నామినేషన్ చేశాడు. మొత్తానికి గ్రూప్ గేమ్ ముగిసి ఎవరి గేమ్ వాళ్లు ఆడే దశకు 12వ వారం నామినేషన్స్ చేరుకున్నాయి. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేక ఒక్కరే వెళ్తారా అనేది పెద్ద సస్పెన్స్‌గా మారింది. ఫినాలేకు నాలుగు వారాలే ఉండటంతో ఈ వారం ఎలిమినేషన్ ఎవరి ఫినాలే కలను చెరిపేస్తుందో చూడాలి. వంశీ డైరెక్ట్ నామినేషన్ నుంచి బయటపడతాడా? వర్షిణి మళ్లీ సేఫ్ అవుతుందా? అనేది తెలియాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

 

 

google-ad-img