Home

»

Tv News

BiggBoss 10 Telugu:ఎలిమినేషన్ తర్వాత ముఖేష్‌కి నీతూ సలహా!

Nov 23, 2026 9:14AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో నిన్నటి ఎంతో సండే ఫండేలో భాగంగా నాగార్జున కంటెస్టెంట్లను ఇద్దరిద్దరుగా విడగొట్టి టాస్కులు పెట్టాడు. గెలిచిన వాళ్లు 12వ వారంలో కెప్టెన్సీ కంటెండర్లుగా నిలుస్తారని  నాగార్జున చెప్పాడు. అందులో వంశీ, త్రిగుణ్ ఇద్దరి మధ్య 8 నిమిషాలకు పైగా సాగిన రోప్ టాస్క్‌లో వంశీని ఓడించి త్రిగుణ్ గెలిచాడు. అలా ఇద్దరు ఇద్దరి మధ్య సాగిన టాస్క్ లలో త్రిగుణ్, ఆర్కే, శివ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, ముఖేష్.. వీళ్లంతా వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. 

 

నామినేషన్లో ఉన్నవారిలో ఒక్కొక్కరుగా సేవ్ అవ్వగా చివరికి సుధీర్, నీతూ మాస్టర్ బాటమ్‌లో మిగిలారు.ఎలిమినేషన్ ప్రక్రియ భిన్నంగా సాగింది. ఇద్దరి కళ్లకు గంతలు కట్టించి అమన్, ముఖేష్‌తో గార్డెన్ ఏరియాకు తీసుకురమ్మన్నాడు నాగార్జున. చివరగా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసుకోండి అని ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు ముఖేష్.. గతంలో వెళ్లేటప్పుడు బాధపడ్డాను, ముఖేష్ అన్న సారీ.. నేను ఒంటరిగానే ఆడాలని అనుకున్నా, అలానే ఆడాను.. నన్ను నేను ప్రూవ్ చేసుకున్నానని సుధీర్ చెప్పాడు. అందరూ నన్ను యాక్సెప్ట్ చేశారు, థాంక్యూ అని నీతూ చెప్పింది. తర్వాత ఇద్దరినీ ఓ సుజుకీ కారులో ఎక్కించి బయటకు పంపించారు. ఆ కారు మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు అందులో ఒక్కరే ఉంటారని, ఇంకొకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పాడు.

 

హౌస్‌మేట్స్‌లో ఎక్కువ మంది నీతూ మాస్టర్ తిరిగి వస్తుందని గెస్ చేశారు. ముఖేష్, వర్షిణి మాత్రం సుధీర్ ఎలిమినేట్ అవుతాడని చెప్పారు. కానీ కారు తిరిగి వచ్చేసరికి అందులో సుధీర్ మాత్రమే ఉన్నాడు. దీంతో నీతూ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించాడు. ఆ తర్వాత స్టేజ్ మీదకు వచ్చిన నీతూ.. హౌస్‌లో ఉండలేకపోయాను, వెళ్లిపోవాలని కోరుకున్నాను, ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉందని చెప్పి అందరిని షాక్‌కి గురిచేసింది. హౌస్‌లో త్రిగుణ్, అమన్, శివ్ గేమ్ చాలా బాగా ఆడుతున్నారని ప్రశంసించింది. అదే సమయంలో వర్షిణి, ముఖేష్, సుధీర్ గేమ్ ఆడట్లేదని కుండబద్దలు కొట్టింది. ఎంత కొట్టినా చావని పామురా అని నరేశ్ అన్నాడు. ఎన్ని దెబ్బలు తిన్నా మళ్లీ లేచి ఆడుతున్నారని  కామెంట్ చేసింది నీతూ. వెళ్లే ముందు ముఖేష్‌కి నీతూ ఓ సలహా కూడా ఇచ్చింది. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు, నీ గేమ్ నువ్వు ఆడు, ఒంటరిగానే నిలబడి ప్రూవ్ చేసుకోమని చెప్పింది. గతంలో తను కూడా అలానే ఒంటరిగా ఆడి ప్రూవ్ చేసుకున్నానని గుర్తుచేసింది. ముఖేష్‌పై తనకు ఎలాంటి కోపం లేదని, అతను తన గేమ్ మార్చుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది. నీతూ మాటలతో హౌస్‌లో ఎలాంటి మార్పులు రానున్నాయో వేచి చూడాలి మరి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com