TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Bigg Boss 10 Telugu: కెప్టెన్ అమన్ పై నాగార్జున ఫైర్!

Nov 29, 2026 11:08AM


బిగ్ బాస్ తెలుగు సీజన్-10 వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కెప్టెన్ అమన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. కెప్టెన్ అయిన తర్వాత కొంచెం కంట్రోల్ తప్పిందా అని నాగార్జున ప్రశ్నించగా అలా ఏం లేదని అమన్ సమాధానమిచ్చాడు. అయితే మనిషి అసలు క్యారెక్టర్ టాప్ పొజిషన్ లో, చాలా ప్రెజర్ లో ఉన్నప్పుడే బయటపడుతుందని, ఆ బిహేవియర్ ఏంటో అదే ఒరిజినల్ క్యారెక్టర్ అని నాగార్జున సీరియస్ అయ్యాడు.

వీడియో ఫుటేజ్ వేసి మరీ అమన్ చేసిన తప్పులను నాగార్జున ఎత్తి చూపించాడు. ముఖేష్ ని పట్టుకుని "ఏంటి గబ్బు" అని ఎలా అంటావని నిలదీశాడు. దీనికి అమన్ తన వర్షన్ చెప్తూ, మిల్క్ వేడి చేయడం కొంచెం బయటికి వెళ్లిందని, తాను క్లీన్ చేస్తుండగా ముఖేష్ డైరెక్ట్ గా వచ్చి.. ఇందుకే నిన్ను బ్రెయిన్ లెస్ అన్నానని స్టార్ట్ చేశాడని చెప్పాడు. ఏ పని కూడా చెప్పిన టైమ్ కి చేయడని, ఈగో ఆల్వేస్ ఈగో అంటూ తన వైపు వాదన వినిపించాడు అమన్. 

అయితే నాగార్జున మాత్రం అమన్ వాదనను ఒప్పుకోలేదు. కెప్టెన్ అనేది పవర్ కాదు, అది ఒక రెస్పాన్సిబిలిటీ అని తేల్చి చెప్పాడు. ముఖేష్ కి స్టార్ డమ్ ఉందని, అలాంటి వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచించి హ్యాండిల్ చేయాలని సూచించాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగ్గేది నువ్వేనని అమన్ కి నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. కెప్టెన్ గా ఉండి హౌస్ మేట్స్ తో గౌరవంగా ప్రవర్తించాల్సింది పోయి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆడియన్స్ లో నెగెటివ్ అయిపోతావని హెచ్చరించాడు. ఈ క్లాస్ తో అమన్ కెప్టెన్సీ పై పెద్ద చర్చే నడుస్తోంది.

 

google-ad-img