
బిగ్ బాస్ సీజన్ 10 రెండో రోజు ఆట రంజుగా సాగింది. ఇంటి సభ్యులు రెండు టీంలుగా విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరు నాయకుల్ని ఎంచుకున్నారు. సెలబ్రిటీల నుంచి రాం ప్రసాద్ ని, సామాన్యుల నుంచి రోహిత్ ని నాయకులుగా ఎంచుకున్నారు. మిగిలిన 12 మంది ఇంటి సభ్యులకు నాయకులకు సైన్యంగా నిలబడటానికి బిగ్ బాస్ బ్యాగ్ టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో కొన్ని బ్యాగ్ లను ఉంచి, ఆ బ్యాగ్ లో ఉన్న బ్యాడ్జ్ ల ఆధారంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.
బ్యాగ్ అందుకున్న సైనికుడు తమ నాయకుడికి ఇవ్వగా, ఆ బ్యాగ్ లో ఉన్న బ్యాడ్జ్ ల ఆధారంగా సైనికుల్ని ఎంచుకున్నారు. మొదటగా ముఖేష్ గౌడ బ్యాగ్ అందుకుని రాం ప్రసాద్ కి ఇవ్వగా తొలి బ్లూ బ్యాడ్జ్ ని త్రిగుణ్ కి ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ అమన్ కి రెడ్ బ్యాడ్జ్ ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ టెంపర్ వంశీకి, శాలినికి రెడ్ బ్యాడ్జ్ ఇచ్చి తన టీంలోకి తెచ్చుకున్నాడు. రాం ప్రసాద్ నరేష్, దేబ్జానిలకు బ్లూ బ్యాడ్జ్ ఇచ్చాడు. ఆ సందర్భంలో రాంప్రసాద్ భారీ డైలాగ్ కొట్టాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉండాలి.. నేను హౌస్ లోకి రాగానే రామన్నా అని పిలిచింది.. ఆ బాండింగ్ కోసమే ఈ బ్యాడ్జ్ ఇస్తున్నానని చెప్పాడు.
చివరికి కృష్ణుడు, చైత్ర మాత్రమే మిగలగా వాళ్లని చివరి వరకూ తమ టీంలోకి తీసుకోలేదు. చివరికి రోహిత్ కృష్ణుడికి బ్యాడ్జ్ ఇస్తూ.. మిగిలింది వాళ్లే కాబట్టి ఫిజికల్ గా వీక్ గా ఉన్న చైత్రని నా టీంలోకి పిక్ చేసుకుంటూ కృష్ణుడుకి ఈ బ్యాడ్జ్ ఇస్తున్నానని చెప్పాడు. దీంతో కృష్ణుడికి కోపం వచ్చింది. కౌంటర్ గా రాం ప్రసాద్.. నాకు వేరే ఆప్షన్ లేదు.. చైత్రని పిక్ చేసుకుని కృష్ణుడుని నా టీంలోకి తీసుకుంటున్నానని చెప్పడంతో చివరి సంగ్రామం టాస్క్ కోసం రెండు జట్లు రెడీ అయ్యాయి.





%20(1).webp)
