
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో మొదటి వారం చరణ్, చైత్ర ఎలిమినేషన్ అవ్వగా చరణ్ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక రెండో వారం అంటే నిన్నటి సండే ఎపిసోడ్ లో సీనియర్ నటుడు కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.. శనివారం నాటి ఎపిసోడ్ నాటి మాస్టర్ పప్పెట్ టాస్క్ ని కంటిన్యూ చేశాడు నాగార్జున. 11 మంది నామినేషన్ లో ఉండగా చివరకు సుధీర్, సృష్టి, కృష్ణుడు మిగిలారు. అందులో సుధీర్ సేఫ్ కాగా సృష్టి, కృష్ణుడు డేంజర్ జోన్ లోకి వెళ్లారు. ఫైనల్ గా అతితక్కువ ఓట్లతో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడు.
కృష్ణుడు రెండో వారంలో పూర్తిగా జీరో ఫుటేజ్ ఇచ్చాడని, ఆడియన్స్ లా ఒక మూలన కూర్చుని చూస్తున్నాడని శనివారం నాగార్జున ఫైర్ అయిన సంగతి తెలిసిందే. టాస్కుల్లో యాక్టివ్ గా లేకపోవడం, గార్డ్ టాస్కులో విజిల్ వేస్తూ తిరగడం, ఫస్ట్ రౌండ్ కే వంశీ, రోహిత్ ల చేత పక్కన పెట్టబడటం అతనికి మైనస్ అయ్యింది. తను ఎలిమినేట్ అవుతానని ముందే మెంటల్ గా ప్రిపేర్ అయ్యానని కృష్ణుడు త్రిగుణ్ తో చెప్పడం కూడా నిజమైంది.
ఎలిమినేషన్ తర్వాత హౌస్ మేట్స్ అంతా ఎమోషనల్ గా వీడ్కోలు పలికారు. రోహిత్ అయితే ఏడ్చేశాడు. మీ కళ్ళు మా నాన్న కళ్లలా ఉన్నాయని కృష్ణుడితో రోహిత్ చెప్తూ ఏడ్చేశాడు. స్టేజ్ పైకి వచ్చిన కృష్ణుడు హౌస్ లో దేబ్జానీ, అమన్, ఝాన్సీ, సృష్టి పాజిటివ్ అని, సుధీర్, ముఖేష్, వర్షిణి, చరణ్ నెగెటివ్ అని చెప్పాడు.
[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Krishnaudu, Bigg Boss Telugu Elimination, Krishnaudu Elimination, Charan Re-Entry, Sudheer, Srushti, Trigun, Rohith]




(3).webp)
