(2).webp)
బిగ్ బాస్ సీజన్ 10 రెండో వారం ఓటింగ్ పోల్ ఆసక్తికరంగా సాగింది. హౌస్ లో ఈ వారం ఎవరుంటారు.. ఎవరు బయటకు వస్తారనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. అయితే అన్ అఫీషియల్ ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం మాత్రం వేరేగా సాగుతోంది.
ఈ వారం శనివారం మార్నింగ్ వరకు జరిగిన ఓటింగ్ ప్రకారం..31.88( 32,179 votes )ఓట్లతో త్రిగుణ్ టాప్-1లో ఉన్నాడు. ఆ తర్వాత రెండవ స్థానంలో రోహిత్ 30.59(30,871) ఓట్లతో ఉన్నాడు. మూడో స్థానంలో ముఖేశ్ 10.08(10,178) ఓట్లతో ఉన్నాడు. ఇక ఆటో రామ్ ప్రసాద్ కి 7.6%, దేబ్జానీకి 5.37%, షాలినికి 3.85% ఓటింగ్ పడింది. వీళ్ళంతా సేఫ్ జోన్ లో ఉన్నట్లే.
ఇక లీస్ట్ ఓటింగ్ తో బాటమ్ లో అయిదుగురు ఉన్నారు. వారిలో ఝన్సీకి 2.41%(2435votes), స్రిష్టికి 2.25%(2266 votes), సుధీర్ 2.06%(2081votes), కృష్ణుడు 1.97%(1988votes), వర్షిణి 1.94%(1959votes) చిట్టచివరి స్థానంలో ఉంది. ఓటింగ్ ని బట్టి చూస్తే వర్షిణి ఎలిమినేషన్ అవ్వాలి కానీ గ్లామర్ పరంగా కన్సిడర్ చేస్తే బిగ్ బాస్ మామ వర్షిణిని అసలు బయటకు పంపడు.. తనకన్నా కాస్త పైనున్న కృష్ణుడిని బయటకు పంపే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కృష్ణుడు ఫిజికల్ గేమ్స్ ఆడలేకపోతున్నాడు. పైగా స్క్రీన్ స్పేస్ కూడా పెద్దగా లేదు.. గొడవలు, ఆర్గుమెంట్స్ కూడా ఏమీ లేదు. ఎక్కడా యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు. అందుకనే ఈసారి కృష్ణుడు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కృష్ణుడిని పాజిటివ్ గా ఆలోచించి మళ్ళీ బెంచ్ కి పరిమతం చేస్తే సుధీర్ ని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉంది.ఇదే జరిగితే అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అవుతుంది. ఎందుకంటే అతను వర్షిణి, కృష్ణుడుల కంటే కాస్త మెరుగైన ఓటింగ్ తో ఉన్నాడు. బిగ్ బాస్ గురించి తెలిసిందేగా ఎప్పుడూ ఎలా ట్విస్ట్ ఇస్తాడో తెలియదు. సుధీర్, వర్షిణి , కృష్ణుడు ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నారు.




.webp)
.webp)
