.webp)
బిగ్ బాస్ తెలుగు 10 డే 12 ఎపిసోడ్ కెప్టెన్సీ టాస్క్ తో రసవత్తరంగా సాగింది. మొదటి కెప్టెన్ ఎవరవుతారనే ఉత్కంఠకు తెరపడింది. అగ్నిపరీక్ష నుంచి గోల్డెన్ టికెట్ తో వచ్చిన కామనర్ ఝాన్సీ తొలి కెప్టెన్ గా గెలిచింది. తను హౌస్ లోకి వచ్చినప్పటి నుండి న్యూట్రల్ గా ఉంటుంది. దాంతో బిగ్ బాస్ చూసే ఆడియన్స్ మాత్రం తను కన్నింగ్ అని అనుకున్నారు కానీ అది తన స్ట్రాటజీ అని గెలిచాక అందరికి అర్థమైంది. తను ఎలా గెలిచిందో చూసేద్దాం.
ఆడియన్స్ ఓటింగ్ తో పవర్ ఆఫ్ పీపుల్ కింద 8 మందిని కెప్టెన్సీ రేసులో పెట్టారు - త్రిగుణ్, రోహిత్, షాలిని, అమన్, దేబ్జానీ, ముకేష్, ఝాన్సీ, రామ్ ప్రసాద్. లెవెల్ 1 బెలూన్ బ్లాస్ట్ టాస్క్ లో త్రిగుణ్, రోహిత్, దేబ్జానీ, రామ్ ప్రసాద్ ఔట్ అయ్యారు. లెవెల్ 2 యానిమల్ పార్క్ టాస్క్ లో ముఖేష్-ఝాన్సీ జంట గెలిచి, అమన్-షాలినిని ఓడించారు. దీంతో ముఖేష్, ఝాన్సీకి అమన్ ని రేసు నుంచి తప్పించే పవర్ వచ్చింది. ఫైనల్ రౌండ్ లో ‘చిక్కకు దొరకకు’ టాస్క్ పెట్టారు. కంటెండర్లను జైలులో పెట్టి, మిగతా వాళ్ళను కానిస్టేబుల్స్ గా చేశారు. జైలు ఫెన్సింగ్ ని కట్టర్ తో కట్ చేసి బయటకు వచ్చి జెండా ఎగరేయాలి. ఈ టాస్క్ లో ఫిజికల్ గొడవలు జరిగాయి. రోహిత్ రామ్ ప్రసాద్ ని నెట్టడం, ముఖేష్ త్రిగుణ్ మెడ పట్టుకోవడం, త్రిగుణ్ టీషర్ట్ చిరగడం జరిగింది. చివరి పోరు రామ్ ప్రసాద్, ఝాన్సీ మధ్య జరిగింది. ఝాన్సీ ముందుగా ఫెన్సింగ్ కట్ చేసి జెండా ఎగరేసి బిగ్ బాస్ 10 మొదటి కెప్టెన్ అయింది. ఆ తర్వాత ఝాన్సీకి బిగ్ బాస్ అభినందనలు చెప్పి స్పెషల్ కెప్టెన్ రూమ్ ఇచ్చారు.
ఇకనుండి ఝాన్సీ కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలని అటు హౌస్ మేట్స్ తో పాటు ఇటు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. తను ఇప్పటివరకు అయితే ఏ గ్రూప్ కి సపోర్ట్ గా నిలవలేదు. మరి కెప్టెన్సీ లో బయాజ్డ్ గా ఉంటుందా లేక ఇప్పటివరకు ఎలా ఉందో అలానే ఉంటుందా చూడాలి మరి.
[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Jhansi, Bigg Boss Telugu Captain, First Captain Jhansi, Captaincy Task, Power of People, Trigun, Rohith, Mukesh Gowda]





(2).webp)
