బిగ్ బాస్ తెలుగు సీజన్ -10 అతి పెద్ద సీజన్ గా రాబోతోంది. సెప్టెంబర్ 6న గ్రాండ్ ప్రీమియర్ తో దశావతారం థీమ్ తో హౌస్ ఓపెన్ కాబోతోంది. ఈ సారి హోస్ట్ నాగార్జున 8వ సారి హోస్ట్ చేస్తున్నారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు. ఇందులో 10 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ అగ్నిపరీక్ష నుండి వచ్చిన వాళ్ళు. ఇదే ఫైనల్ లిస్ట్ అని సోషల్ మీడియాలో లీక్ అయింది.
ఫైనల్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ 10 మంది: ఫైనల్ సెలబ్రిటీ లిస్ట్ లో పాపులర్ పేర్లు ఉన్నాయి. వర్షిణి సౌందరరాజన్, ముకేష్ గౌడ, జబర్దస్త్ రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, టెంపర్ వంశీ, చైత్ర రాయ్, కృష్ణుడు, అదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్, దేబ్జానీ మోదక్, యూట్యూబర్ సుధీర్ రెడ్డి. వీళ్లంతా ఇప్పటికే సెట్స్ దగ్గరకు చేరుకున్నారని, ప్రీమియర్ రోజు ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.
కామనర్స్ విభాగంలో అగ్నిపరీక్షలో గెలిచిన ఆరు మంది ఫైనల్ అయ్యారు. సింగర్ ఝాన్సీ, రోహిత్, శాలిని, శ్రష్టి వ్యాకరణం, నవరసాలు రామకృష్ణ, ఆర్జే చరణ్. వీళ్ళు సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. ఈ సారి కామనర్స్ కి ఈక్వల్ పవర్ ఇస్తున్నారు కాబట్టి గేమ్ మొదటి నుండే రసవత్తరంగా ఉంటుంది.
ఈ 16 మందే ఫైనల్ కంటెస్టెంట్స్ అని దాదాపు కన్ఫమ్ అయింది. సెప్టెంబర్ ఆరున 7 గంటలకు స్టార్ మాలో నాగార్జున వీళ్ళని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తారు. దశావతారం థీమ్ ప్రకారం హౌస్ కూడా 10 అవతారాల కాన్సెప్ట్ తో డిజైన్ చేశారు. ఇక 105 రోజుల పాటు డ్రామా, ఫైట్స్, టాస్కులు షురూ కాబోతున్నాయి.
Bigg Boss Telugu 10, BB Telugu 10 contestants, Star Maa Bigg Boss, JioHotstar Bigg Boss Telugu, Bigg Boss Telugu 10 leaked list, Varshini Sounderajan Bigg Boss, Mukesh Gowda Bigg Boss, Jabardasth Ram Prasad Bigg Boss, Temper Vamsi, Chaitra Rai, Krishnudu, Adith Arun, Dasavataram theme Bigg Boss




