Home

»

Tv News

Agnipariksha season :అగ్నిపరీక్ష సీజన్-2 లో సంచలనం - టికెట్ టు బిగ్ బాస్ హౌస్ గెలుచుకున్న సింగర్ ఝాన్సీ!

Sep 6, 2026 10:57AM

 

అగ్నిపరీక్ష సీజన్-2 లో ఈరోజు జరిగిన టాస్క్ హై వోల్టేజ్ డ్రామాతో నడిచింది. బిగ్ బాస్ హౌస్ లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చే టికెట్ టు బిగ్ బాస్ హౌస్ కోసం ఫైనల్ పోటీ జరిగింది. ఈ టాస్క్ లో అందరిని వెనక్కి నెట్టి సింగర్ ఝాన్సీ అద్భుతంగా ఆడి టికెట్ గెలుచుకుంది. దీంతో బిగ్ బాస్ సీజన్-10 హౌస్ లోకి మొదటి కామనర్ గా ఝాన్సీ ఎంట్రీ కన్ఫమ్ అయింది.

ఈ సీజన్ లో ఝాన్సీ మొదటి నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంది. పాటతో పాటు టాస్కుల్లో కూడా తన సత్తా చాటింది. ఫైనల్ టికెట్ టాస్క్ లో ఎమోషనల్ గా, ఫిజికల్ గా చాలా కష్టపడింది. చివరి రౌండ్ లో ఇతర కంటెస్టెంట్స్ ను బీట్ చేసి ట్రోఫీతో పాటు టికెట్ ను సొంతం చేసుకుంది. జడ్జెస్ కూడా ఝాన్సీ గేమ్ ను మెచ్చుకున్నారు.

ఝాన్సీ టికెట్ గెలవడంతో మిగిలిన 5 మంది కామనర్స్ పరిస్థితి టెన్షన్ లో పడింది. ఇప్పటికే రోహిత్, శాలిని, శ్రష్టి, రామకృష్ణ, చరణ్ వీళ్ళు రేస్ లో ఉన్నారు. వీళ్ళలో నుండి మరో 5 మందిని సెలెక్ట్ చేసి మొత్తం 6 మంది కామనర్స్ ను సెప్టెంబర్ 6న బిగ్ బాస్ మెయిన్ హౌస్ లోకి పంపనున్నారు. ఝాన్సీ మాత్రం ఫస్ట్ కన్ఫమ్ కంటెస్టెంట్ అయిపోయింది.

మొత్తానికి అగ్నిపరీక్ష సీజన్-2 ఫైనల్ దశకు చేరుకుంది. సింగర్ ఝాన్సీ టికెట్ టు బిగ్ బాస్ హౌస్ గెలవడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఝాన్సీకి కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. మరి మెయిన్ హౌస్ లో ఝాన్సీ ఎలా ఆడుతుంది.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా లేదా అనేది సెప్టెంబర్ 6 నుండి తెలియనుంది.

 

 

[Agnipariksha Season2, Jhansi Ticket To Bigg Boss House, Bigg Boss Telugu 10 Commoners, Singer Jhansi Bigg Boss, Agnipariksha Today Episode, Bigg Boss Telugu 10 First Contestant]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com