Home

»

Tv News

బిగ్ బాస్ హౌస్‌లోకి గ్లామర్ బ్యూటీ.. 'ఎన్నెన్నో జన్మల బంధం' ఫేమ్ దెబ్జాని మోదక్ ఎంట్రీ!

Sep 6, 2026 2:44PM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న హాట్ కంటెస్టెంట్స్ లో దెబ్జాని మోదక్ ఒకరు. ఈ సీజన్ లో 10 మంది సెలబ్రిటీలలో దెబ్జాని పేరు దాదాపు కన్ఫమ్ అయింది. సెప్టెంబర్ 6న జరగబోయే గ్రాంఢ్ ప్రీమియర్ లో నాగార్జున చేతుల మీదుగా ఆమె ఎంట్రీ ఇవ్వబోతోంది. దశావతారం థీమ్ తో వస్తున్న ఈ సీజన్ కి గ్లామర్ యాడ్ చేయడానికి దెబ్జానిని తీసుకువస్తున్నారని టాక్.

అసలు దెబ్జాని ఎవరంటే... కోల్ కతాకు చెందిన బెంగాలీ బ్యూటీ. 1996 మార్చ్ 20న పుట్టింది. బెంగాలీ సీరియల్ 'అపోంజన్' తో కెరీర్ మొదలుపెట్టి, తమిళంలో 'రాసాతి', 'వానతై పోల' సీరియల్స్ చేసింది.తెలుగులో స్టార్ మాలో వచ్చిన 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఈ సీరియల్ తో బెస్ట్ వైఫ్ గా స్టార్ మా అవార్డు, పద్మమోహన అవార్డ్స్ లో బెస్ట్ హీరోయిన్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇండస్ట్రీలో తనని అందరు 'కిన్ని' అని పిలుస్తారు.

ఈ సారి బిగ్ బాస్ లో దెబ్జాని ఎంట్రీ వెనుక బిగ్ రీజన్ ఉంది. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకుని ఇక్కడ స్టార్ అయిన బెంగాలీ అమ్మాయి అనే సింపతీ, గ్లామర్ రెండూ ఆమెకు ప్లస్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. హౌస్ లో గ్లామర్ తో పాటు స్ట్రాంగ్ ఎమోషనల్ గేమ్ ఆడుతుందని అంచనా. జబర్దస్త్ కామెడియన్లు, సీరియల్ హీరోల మధ్య ఆమె ఎలా సర్వైవ్ అవుతుందనేది చూడాలి.

మొత్తానికి బిగ్ బాస్ సీజన్-10 లో దెబ్జాని మోదక్ కీలక కంటెస్టెంట్ గా మారబోతోంది. ఇప్పటికే ఇన్ స్టాలో 249K ఫాలోవర్స్ ఉన్న ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మెయిన్ హౌస్ లోకి వెళ్ళాక లవ్ ట్రాక్, ఫైట్స్, టాస్కుల్లో ఆమె ఎలా ఉంటుందో చూడాలి. దెబ్జాని టైటిల్ రేస్ లో ఉంటుందా లేక మిడ్ వీక్ లోనే ఎలిమినేట్ అవుతుందో చూడాలి మరి 

 

 

[Debjani Modak Bigg Boss Telugu 10, Bigg Boss Telugu 10 Debjani, Ennenno Janmala Bandham Actress Bigg Boss]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com