Home

»

Tv News

Bigg Boss 10 Episode 3 :బిగ్ బాస్ కంటెస్టెంట్ సింగర్ జాన్సీ.. హౌస్ లో ఎలా ఉంటుందంటే!

Sep 9, 2026 9:56AM

ఫోక్ సింగర్ జాన్సీ బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ లోకి అగ్నిపరీక్ష ద్వారా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. 15 మందితో పోటీపడి గోల్డెన్ టికెట్ గెలుచుకుని ఫస్ట్ కన్ఫమ్ కంటెస్టెంట్ గా నిలిచింది. హౌస్ లోకి మూడవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున ముందు తన జానపద పాటతో అందరిని ఆకట్టుకుంది. తన గేమ్ స్ట్రాటజీ గురించి అడిగితే.. నేను ఎప్పుడూ వదులుకోను.. చివరి క్షణం వరకు పోరాడుతానని చెప్పింది. టాస్క్ లలో చాలా గట్టిగా పోటీపడుతుంది. లాంఛ్ రోజు ఇచ్చిన 10 పవర్స్ లో ఎవిక్షన్ ఫ్రీ పవర్ జాన్సీకి వచ్చింది. దీనితో ఒక వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ గా ఉండొచ్చు.

 

స్టార్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్యలో సామాన్యురాలిగా వచ్చినా ట్రోఫీపై క్లియర్ ఫోకస్ తో ఉంది. కెప్టెన్ రూమ్ కి వెళ్లాలని మొదటి రోజే చెప్పింది. హౌస్ లోకి వెళ్లిన రెండు రోజులకే జాన్సీ పూర్తి నెగెటివ్ గా మారిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే గడిచిన రెండు రోజుల్లో కామనర్స్ అంతా ఒకవైపు, సెలబ్రిటీలు అంతా ఒకవైపుగా ఉన్నారు.

 

నిన్న జరిగిన టాస్క్ లో రెడ్ టీం రోహిత్ టీంలో ఆరుగురు కామనర్స్, ఇద్దరు సెలబ్రిటీలు ఉన్నారు. గ్రూప్ లో జరిగిన డిస్కషన్ విని, ఆ డిస్కషన్ ని ఆపోజిట్ టీమ్ దగ్గర కూర్చొని చెప్పేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. కామనర్స్ టీంలో ఉండి కూడా వాళ్లతో కలవకపోవడం చూసి ఆడియన్స్.. అనవసరంగా నిన్ను హౌస్ లోకి పంపించారని కామెంట్లు చేస్తున్నారు. అగ్నిపరీక్షలో హేమంత్ తన గురించి .. ఆమె ఎవరు గెలిస్తే వాళ్లతోనే ఉంటుందని అన్న మాట ఇప్పుడు నిజం అనిపిస్తోందని త్వరగా ఎలిమినేట్ చేయండి ఈ కన్నింగ్ లేడీని అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com