
బిగ్ బాస్ తెలుగు 10 రెండో రోజే రణరంగంగా మారింది. బిగ్ బాస్ ఈ వారం అందరినీ నామినేట్ చేసి మహాపరీక్ష పెట్టాడు. మీరు కంటెస్టెంట్స్ నుంచి హౌస్ మేట్స్ గా మారాలంటే ఈ పరీక్షను ఎదుర్కోవాల్సిందే అని చెప్పాడు. ఇందుకోసం హౌస్ ని రెండు టీమ్స్ గా డివైడ్ చేశాడు. బ్లూ టీం లీడర్ గా ఆటో రాంప్రసాద్, రెడ్ టీం లీడర్ గా రోహిత్ నాయుడు ఎంపికయ్యారు. బ్లూ టీమ్ లో రాంప్రసాద్ తో పాటు నరేష్, త్రిగుణ్, ముఖేష్ గౌడ, దేబ్జానీ, సుధీర్, కృష్ణుడు, వర్షిణి ఉన్నారు. రెడ్ టీమ్ లో రోహిత్ తో పాటు శ్రష్టి, టెంపర్ వంశీ, షాలిని, అమన్, ఝాన్సీ, చరణ్, చైత్రా ఉన్నారు. ఇది సెలబ్రిటీ వర్సెస్ అగ్నిపరీక్ష టీమ్ లా కనిపిస్తోంది. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఎదుటి టీంలో హౌస్ మేట్ అయ్యే అర్హత లేని ఐదుగురిని సరైన కారణాలతో చెప్పి వారి ఫోటోలపై పిన్ గుచ్చాలని బిగ్ బాస్ చెప్పాడు.
బ్లూ టీం రెడ్ టీం లోని రోహిత్, చరణ్, షాలిని, అమన్, శివ శ్రిష్టి లను అనర్హులుగా సెలెక్ట్ చేసింది. అగ్నిపరీక్షలో రోహిత్ ని అందరూ లేపి లేపి పైన కూర్చోబెట్టారని వర్షిణి అంది. అక్కడ ఫైర్ చూపించిన చరణ్ ఇక్కడ జీరోగా ఉన్నాడు.. అక్కడ వంద చూపిస్తే ఇక్కడ పది కూడా లేదని రాంప్రసాద్ అన్నాడు. షాలిని తనని తాను ఎక్కువగా అనుకుంటోందని దేబ్జానీ అంది.
ఇక రెడ్ టీం లీడర్ రోహిత్ బ్లూ టీం నుంచి త్రిగుణ్, రాంప్రసాద్, దేబ్జానీ, వర్షిణి, కృష్ణుడులను నామినేట్ చేశాడు. రోహిత్ మాట్లాడుతూ..త్రిగుణ్ కి ఓపిక లేదు.. ఓవర్ డామినేషన్ ఉంది, రాంప్రసాద్ రూల్స్ బ్రేక్ చేశాడు.. వర్షిణి నటిస్తున్నట్లు ఉంది.. కృష్ణుడు టాస్క్ లో గివ్ అప్ ఇచ్చేశాడు.. 100% ఇవ్వలేదని కారణాలు చెప్పాడు. వెంటనే కృష్ణుడు ఫైర్ అయ్యాడు. నేను 100 శాతం ఇవ్వలేదని అంటావా.. నీకు అసలు లీడర్ అయ్యే లక్షణాలే లేవు. నువ్వు రాజువని, మేం సైనికులమని అనుకుంటున్నావా లేక నువ్వు లీడర్ అని మీ సేవకులని అనుకుంటున్నావా అని కృష్ణుడు ఫైర్ అయ్యాడు. మేం ఎలా ఆడాలో నువ్వు చెప్తావా.. నీకు కెప్టెన్ అయ్యే అర్హతే లేదంటూ రోహిత్ కృష్ణుడు కోప్పడ్డాడు. కృష్ణుడు సినిమాల్లో అమాయకుడిలా కనిపించినా హౌస్ లో మరో యాంగిల్ చూపిస్తానన్న మాటను నిజం చేశాడు. మొదటి రోజే త్రిగుణ్ vs రోహిత్ గొడవతో స్టార్ట్ అయిన బిగ్ బాస్, రెండో రోజు కృష్ణుడు vs రోహిత్ తో మరింత వేడెక్కింది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పోరులో ఎవరు హౌస్ మేట్స్ గా మారతారు, ఎవరు ఎలిమినేషన్ రిస్క్ లోకి వెళ్తారో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.




.webp)

