(9).webp)
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో స్టార్టింగ్ లోనే మాస్ సాంగ్ తో మొదలైంది. కుర్రాళ్లు.. కుర్రాళ్లు" అంటూ ధనరాజ్ తన టీమ్ తో ఎంట్రీ ఇస్తాడు. ఈ పాట వచ్చినప్పుడు.. మీరు కుర్రోళ్లు.. ఇంకా వేసుకుంటున్నారా.. అంటూ జడ్జి ఇంద్రజ పంచ్ విసిరింది. తర్వాత స్కిట్ లో..మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం.. పది లక్షల రూపాయలు ఇస్తేనే మీ అబ్బాయిని పంపిస్తామని కిడ్నాపర్ లా ఫోన్ చేస్తాడు ధనరాజ్. దాంతో..మీరు అడిగినట్లుగా పది లక్షలు ఇచ్చేస్తానని కమెడియన్ అంటాడు.మా దగ్గర ముప్పై లక్షలున్నాయి కాబట్టి పది లక్షలు ఇచ్చి మా పిల్లాడిని కాపాడుకున్నామని తండ్రి చెప్పడంతో అతని దగ్గరున్న మిగిలిన డబ్బు కూడా కొట్టేయాలని ధనరాజ్ ప్లాన్ చేస్తాడు. రోడ్డు మీద తిరగకండి కిడ్నాపర్లు తిరుగుతున్నారని తండ్రి క్యారెక్టర్ లో ఉన్న కంటెస్టెంట్ చెబితే..ఎలా చేస్తారు కిడ్నాప్ అని ధనరాజ్ అడగ్గా..ఇలా కర్చీఫ్ పెట్టి కిడ్నాప్ చేసేస్తారని అనడంతో అలాగే ఆ మనిషిని కిడ్నాప్ చేస్తుంది ధనరాజ్ గ్యాంగ్.
ఆ తర్వాత పటాస్ ప్రవీణ్, సద్దాంలు ఎంట్రీ ఇస్తారు. చిన్నప్పటి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ చాలాకాలం తర్వాత కలుసుకోవడంతో ఇద్దరూ కలిసి మందు తాగుతారు. ఇంతలో ఓ అమ్మాయి రావడంతో ఆమెను హగ్ చేసుకుంటాడు ప్రవీణ్.. అది అమ్మాయి కాదు మన రమేశ్ గాడు అని సద్దాం చెప్పడంతో ప్రవీణ్ షాక్ అవుతాడు. తర్వాత మరో అమ్మాయి రావడంతో హగ్ చేసుకోకుండా దూరంగా నిలబడి షేక్ హ్యాండ్ ఇస్తాడు. వచ్చింది లేడీ గెటప్ కాదు.. నువ్వు లవ్ చేసిన కవిత అని సద్దాం చెప్పడంతో ప్రవీణ్ ఉలిక్కిపడతాడు. మరో స్కిట్ లో సుధాకర్, ఫైమాలు వస్తారు. లేడీ గెటప్ లో ఉన్న సుధాకర్ కు ఓ కమెడియన్ బట్టలు ఎలా ఉతకాలో నేర్పిస్తుండగా ఫైమా వచ్చి ఇద్దరిని చితకబాదుతుంది. నువ్వు అనుకుని ఇక్కడికి వచ్చానని భర్త కవర్ చేస్తుండగా.. దానికి నాకు తేడా లేదా అని ఫైమా ప్రశ్నిస్తుంది. సుధాకర్ ను బయటకు గెంటేస్తుండగా విగ్గు ఊడి చేతిలోకి రావడంతో అంతా నవ్వేస్తారు.
ఆ వెంటనే దొరబాబు, చలాకీ చంటీలు తమ స్కిట్ తో వస్తారు. ఓ నెమలి పించాన్ని దొరబాబుకు ఇచ్చిన చంటీ.. దీనిని కనుక నువ్వు తల కింద పెట్టుకుని పడుకుంటే కల్లోకి అమ్మాయి వస్తుందని చెప్తాడు. దాంతో.. ఇప్పుడే పడుకుంటానని పరిగెత్తుతాడు దొరబాబు. అయితే ఆశ్చర్యంగా చంటి కలలోకి దొరబాబు ఓ అమ్మాయి వచ్చి రొమాన్స్ చేస్తుంటారు. దాంతో దొరబాబును నిద్రలేపి.. నేను ఇచ్చిన పించాన్ని తిరిగి ఇచ్చేయ్ అంటాడు. అక్కడ నీళ్లు మరిగిపోతున్నాయిరా అంటూ దొరబాబు కోప్పడతాడు. మరో స్కిట్ లో తాగుబోతు రమేశ్, రోహిణి, పంచ్ ప్రసాద్, బుల్లితెర నటుడు కౌశిక్ లు వస్తారు. పేపర్ చదువుకుంటూ కూర్చున్న కౌశిక్ దగ్గరికి ప్రసాద్ వెళ్లి.. మీరు రోహిణి హజ్బెండేనా అని అడిగి ఫోటోలు, ఫోన్ లో ఉన్న వీడియో చూపిస్తాడు. నాకు కళ్లు లేవండి కనపడదని కౌశిక్ చెప్పగా తన కళ్లు ఇచ్చేస్తాడు పంచ్ ప్రసాద్. వాడెవడో మహానుభావుడు కిడ్నాప్ చేసి మరి తన కళ్లు నాకు ఇచ్చేశాడని కౌశిక్ చెప్తాడు. వెంటనే పంచ్ ప్రసాద్ వచ్చి.. ఈ ఫోటోలు వాడికి చూపించమని చెప్పగా.. ఫోన్ ఓపెన్ కావడం లేదు.. నీ కళ్లు అక్కడ ఉన్నాయి ఈ ఫేస్ లాక్ ఓపెన్ కాదని చెప్తాడు. తర్వాత మళ్లీ కౌశిక్ కళ్లు పీకేసి తను పెట్టుకుని ఫోన్ చూపించమంటాడు. వాడికి కళ్లు లేవు కదా అని రమేశ్ అనడంతో అంతా నవ్వేస్తారు. నీకు బుర్ర పనిచేయడం లేదా.. 20 లక్షల రూపాయలు ఆపరేషన్ కోసం ఖర్చు పెట్టే బదులు కోఠికి వెళ్తే 2 వేల రూపాయలకు ఓపెన్ చేస్తాడని రోహిణి పంచ్ విసరడంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






