TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Bigg Boss 10 Telugu:కెప్టెన్సీ రేస్‌లో అమన్‌ని గెలిపించిన శోభాశెట్టి.. పాపం నరేశ్!

Nov 26, 2026 8:19AM

బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం బడ్డీ అప్ థీమ్ సాగుతోంది. ఇందులో భాగంగా మాజీ కంటెస్టెంట్లు ఇంట్లోకి వస్తున్నారు. ఈ క్రమంలో నేటి ఎపిసోడ్‌లో రీతూ, పవన్, టేస్టీ తేజ, శోభా శెట్టి వచ్చారు. టాస్కులో డెమాన్ పవన్ ఆడి దేబ్జానీని.. శోభా శెట్టి ఆడి అమన్‌ను గెలిపించారు. అలా ఈ రోజు టాస్కులో అమన్, దేబ్జానీ గెలిచి చివరి కెప్టెన్సీ కంటెండర్ రేసులో నిలిచారు. ఆల్రెడీ నిన్నటి టాస్కులో ఆర్కే, శివ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికి నలుగురు కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు.

ఇంట్లోకి టేస్టీ తేజ, శోభా శెట్టి ఎంట్రీ ఇస్తారు. ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ ఎవరితో చేస్తారు.. ఎవరితో కట్ చేస్తారు అనే టాస్క్ పెట్టించాడు. అందులో త్రిగుణ్ వచ్చి.. వంశీతో కంటిన్యూ చేస్తాను అని, వర్షిణితో కట్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత ముకేష్ వచ్చి.. వర్షిణితో కంటిన్యూ, సుధీర్‌తో కట్ చేస్తా అని అంటాడు. హౌస్ లో‌ మోస్ట్ సీనియర్ నేనే.. ఎందుకంటే నేను రెండుసార్లు హౌస్ లోకి వచ్చాను.. అంటే పద్దెనిమిది నెలలు హౌస్ లో ఉన్నానంటూ టేస్టీ తేజ అన్నాడు.

ఆ తర్వాత శోభాశెట్టి- అమన్ ఒక జట్టుగా నరేష్ - టేస్టీ తేజ కలిసి టాస్క్ ఆడతారు. ఈ టాస్కుకి సంఛాలక్ గా వర్షిణి ఉంది. పదే పదే నరేష్‌కి బాల్‌ను త్రో చేస్తుంటుంది వర్షిణి. సంఛాలక్ గా ఇది అన్‌ఫెయిర్ అని అమన్, శోభాశెట్టి వాదిస్తుంటారు. కానీ వర్షిణి మాత్రం నరేష్‌కి ఫేవర్‌గానే ఆటను ఆడలేదు. అక్కడ వారికి అవకాశం రాలేదు కాబట్టి ఇచ్చింది. మధ్యలో టేస్టీ తేజ బరువుకి ఆ రోప్ బెల్ట్ తెగిపోతుంది. కాసేపటికి బిగ్ బాస్ కొత్తది పంపిస్తాడు. అయితే నరేశ్ కి రెండుసార్లు బాల్ రాగా.. అతను హైట్ తక్కువ ఉండటం వల్ల పైన ఉన్న బోర్డ్ కి తగిలి అది అమన్ చేతికి వెళ్ళింది. దాంతో నరేశ్ డిస్సప్పాయింట్ అయ్యాడు.  చివరకు అమన్, శోభాశెట్టిలే ఈ టాస్కులో గెలిచారు. నరేష్ ఇలా చివరి వరకు వచ్చి ఓడిపోవడంపై కాస్త బాధపడుతాడు. ప్రతీసారి ఇలానే అవుతోంది.. చివరి వరకు వస్తున్నా.. నా చేతులతో నేనే అంతా పాడుచేసుకుంటున్నా అని నరేష్ బాధ పడుతుంటాడు. నరేశ్ కి రామ్ ప్రసాద్ భరోసానిచ్చాడు. వర్షిణి అన్‌ఫెయిర్ సంచాలక్ అని అమన్ అరుస్తూ ఉంటాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో దేబ్జానీ, అమన్ ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్ రేస్‌లో నిలిచారు.

 

google-ad-img