TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

ఇదే నా లాస్ట్ రివ్యూ.. రోహిత్ ఎలిమినేషన్ తో షాక్: కౌశల్ మండా!

Nov 25, 2026 4:14PM

బిగ్ బాస్ తెలుగుకి సంబంధించిన  మాజీ విన్నర్ కౌశల్ మండా తన లాస్ట్ బిగ్ బాస్ రివ్యూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేశాడు.

"MY LAST BIGG BOSS REVIEW - SEASON 10!" అంటూ కౌశల్ మండా సెల్ఫీ వీడియోలో మాట్లాడాడు. సాధారణంగా సెకండ్ వీక్ లో తాను ప్రిడిక్ట్ చేసింది జరుగుతుందని.. ఈ సీజన్ లో రోహిత్ నాయుడు, త్రిగుణ్ ఇద్దరూ టాప్-2 కి వెళ్తారని ముందే చెప్పానని అన్నాడు. కానీ అన్‌ఫార్చ్యునేట్ గా కొన్ని పరిస్థితుల వల్ల రోహిత్ అవుట్ అవ్వడంతో రివ్యూలు కంటిన్యూ చేయాలనిపించడం లేదని చెప్పాడు.

 

రోహిత్ కు బిగ్ బాస్ నుండి మరో కాల్ వచ్చినా పర్సనల్ నిర్ణయం వల్ల రిజెక్ట్ చేసి షో నుండి బయటకు వచ్చేశాడని కౌశల్ వెల్లడించాడు. రోహిత్ ఎగ్జిట్ తో ఫ్యాన్స్ అందరూ హర్ట్ అయ్యారని, చాలామంది షో చూడటం మానేశారని అన్నాడు. అయినా మిగిలిన కంటెస్టెంట్ల గేమ్ బాగానే ఉందని మెచ్చుకున్నాడు.

 

ఈ సీజన్ చాలా ప్లెయిన్ గా, సో-సో గా ఉందని, నెక్స్ట్ సీజన్ లో స్ట్రాంగర్ కంటెస్టెంట్లు, బిగ్గర్ ఎంటర్టైన్మెంట్ తో కలుద్దామని అన్నాడు. ఇక ఫైనల్ గా త్రిగుణ్ ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతాడని, దీనిలో ఎలాంటి డౌట్ లేదని కౌశల్ ముందే కంగ్రాట్స్ చెప్పాడు. రోహిత్ కు బెటర్ లక్ ఉండాలని కోరుకుంటూ తన లాస్ట్ వ్లాగ్ ను ముగించాడు. 

 

 

 

 

google-ad-img