
బిగ్ బాస్ హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్ అయిన వెంటనే ఆదిరెడ్డి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కృష్ణుడు ఎలిమినేషన్ అయ్యాక హ్యాపీగా ఫీలవుతున్నాడంటూ డాన్స్ చేస్తూ ఒక వీడియోని ఆదిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కృష్ణుడు బయటకు వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాడా అనే చర్చ మొదలైంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అయితే తాజాగా కృష్ణుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే విషయాన్ని కృష్ణుడితో అడిగింది. మీరు ఎలిమినేషన్ అయినందుకు హ్యాపీగా ఉన్నారని ఆదిరెడ్డి అన్నారు, నిజమేనా అని అడిగింది. దీనికి కృష్ణుడు చాలా మెచ్యూర్డ్ గా సమాధానమిచ్చాడు. అది అతనికి అనిపించి ఉండొచ్చు.. తను హౌస్ లోకి గేమ్ ఆడదామనే వెళ్లానని.. కానీ తను అనుకున్న అడిక్షన్ ను కంట్రోల్ చేసుకోవడం వల్ల కొంచెం వెనకబడ్డానని ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చాడు.ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన వ్యక్తే కదా, అతను నా గురించి అలా అనడం కరెక్ట్ కాదని చెప్పాడు.
అది రెడ్డి వర్సెస్ కృష్ణుడు వివాదంపై కృష్ణుడు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు. నేను హౌస్ నుంచి వచ్చేటప్పుడు హౌస్ మేట్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. నేను కూడా ఎమోషనల్ అయ్యాను.. హౌస్ లోని కంటెస్టెంట్స్ భాదపడిన వీడియో ఆదిరెడ్డి చూడలేదేమో చూస్తే తెలిసేదని కృష్ణుడు చెప్పాడు. తను అందరిని చాలా మిస్ అవుతున్నానని చెప్తూ ఆదిరెడ్డి చేసిన ట్రోలింగ్ వీడియోకు తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చాడు. దీంతో కృష్ణుడు మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎలిమినేషన్ పై డాన్స్ లు చేసిన ఆదిరెడ్డికి కృష్ణుడు స్ట్రాంగ్ కౌంటర్!
Sep 24, 2026 10:29AM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




(4).webp)
