(4).webp)
బిగ్ బాస్ సీజన్10 తెలుగు లో ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఉత్కంఠగా సాగింది. ఈ వారం మొత్తం హౌస్ లో టెంప్టేషన్, టెన్షన్ అనే థీమ్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా బిగ్ బాస్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో మూటల టాస్క్ ను ఇచ్చాడు. పూల్ లో ఉన్న మూటలను తెచ్చి తమకు కేటాయించిన స్టాండ్ పై వేయాలని.. ఇందులో గెలిచిన వారు కెప్టెన్సీ కంటెండర్ అవుతారని బిగ్ బాస్ ప్రకటించాడు.
ఈ టాస్క్ లో రెండో బజర్ మోగిన తర్వాత అమన్, వర్షిణి మధ్య పోటీ మొదలైంది. ఇద్దరూ ఒకేసారి మూటల కోసం ఎగబడ్డారు. అమన్ చాకచక్యంగా రెండు మూటలను రెండు చేతుల్లో గట్టిగా పట్టుకున్నాడు. వాటిని ఎలాగైనా లాక్కోవాలని వర్షిణి తీవ్రంగా ప్రయత్నించింది. అమన్ ను వెనుక నుంచి పట్టుకుని లాగడం, అతని చేతుల్లో నుంచి మూటలను తీసేందుకు శక్తినంతా ఉపయోగించడం చేసింది.
అయితే ఆడ, మగ కంటెస్టెంట్స్ మధ్య జరిగిన ఈ టాస్క్ లో వారి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ కాస్త శృతి మించినట్లుగా కనిపించింది. వర్షిణి అమన్ ను గట్టిగా పట్టుకుని లాగడం..అమన్ కూడా తగ్గకుండా మూటలను కాపాడుకుంటూ ఆమెను అడ్డుకోవడం చూసే ప్రేక్షకులకు కాస్త అభ్యంతరకరంగా, ఇబ్బందిగా అనిపించింది. టాస్క్ లో గెలవాలనే కసితో వాళ్లు లైన్ క్రాస్ చేసినట్లుగా సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది.
పరిస్థితి చేయి దాటి గొడవకు దారి తీసేలా ఉందని గ్రహించిన ఈ టాస్క్ సంచాలక్ ముఖేష్ వెంటనే రంగంలోకి దిగాడు. ఇలా పట్టుకోవద్దు, అలా లాగొద్దంటూ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాడు. ఆ టాస్క్ లో అమన్ గెలిచి తన ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ ని పొందాడు. అలాగే షాలిని రోహిత్ లలో ఒకరికి టెన్షన్ పెట్టాలి.. తమ ఫ్యామిలీ నుంచి వచ్చే సర్ ప్రైజ్ మిస్ చెయ్యాలంటే రోహిత్ ని సెలక్షన్ చేసుకున్నాడు అమన్. తన ఫ్యామిలీ నుంచి సర్ ప్రైజ్ మిస్ అలాగే కంటెండర్ రేస్ నుంచి తొలగిపోయినట్లు అని బిగ్ బాస్ చెప్పగానే రోహిత్ బాధపడుతాడు. అయితే రోహిత్ కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుండి తప్పుకోవడం వల్లి తీవ్రంగా బాధపడ్డాడు.
[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Captaincy Contender Task, Aman, Varshini, Rohith, Mukesh Gowda, Shalini, Temptation vs Tensions, Bigg Boss Telugu Task, Bigg Boss Telugu Captaincy]




(5).webp)

