Home

»

Tv News

Jayam Serial : బాలకృష్ణను చంపేందుకు వీరు స్కెచ్.. రుద్ర సంచలన నిర్ణయం!

Sep 24, 2026 3:45PM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ జయం Jayam. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 381లో.. విశ్వకి ఎదురు వెళ్తే తన ఇగోతో జయ, వంశీ పెళ్లిని ఆపేస్తాడని శకుంతల ఆందోళన వ్యక్తం చేస్తుంది. దానికి ఇందుమతి, ఇషికలు స్పందిస్తూ పెళ్లి వరకు వచ్చి ఆగిపోతే పరువుపోతుందని బావగారు అలా జరగనివ్వరని అంటారు. 

నా భార్యను ఛాంపియన్ చేయడం నా బాధ్యత, అలాగే నా ఇంటి గౌరవాన్ని కాపాడడం కూడా నా బాధ్యత. వంశీకి ఈ ఇంటికి గౌరవం తెచ్చే అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేస్తానని రుద్ర చెప్తాడు. రుద్ర మాటల వెనుక అర్థం శకుంతలకు అర్థం కాదు. ఎవరి ఇగో కోసమో వదిన తన లక్ష్యాన్ని ఎందుకు వదులుకోవాలని ప్రీతి అంటుంది.

మరోవైపు విశ్వ, జయ స్పాన్సర్ షిప్ విషయంలో ఎదురైన సమస్యతో కోపంగా ఇంటికి వస్తారు. జరిగిన విషయాన్ని సుధాకు వివరిస్తారు. ఇదే సమయంలో ఇషిక, వీరు బాలకృష్ణ గురించి సీక్రెట్ గా మాట్లాడుకుంటారు. నిజం బయటకు రాకూడదంటే బాలకృష్ణను అడ్డుతొలగించాలని వీరు ప్లాన్ వేస్తాడు.  

చివర్లో వీరు మాస్క్ ధరించి హాస్పిటల్ లో ఉన్న బాలకృష్ణపై దిండుతో దాడి చేస్తాడు. వీరు ప్లాన్ ని రుద్ర కనిపెడతాడా..మరి బాలకృష్ణ బతికాడా.. వీరు హత్యాయత్నం ఫలించిందా లేదా అనేది తెలియాలంటే  తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Jayam, Jayam Episode 381, Zee Telugu Serial, Rudra, Jaya, Vamsi, Vishva, Shakuntala, Veeru, Balakrishna]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com