.webp)
ఈ మధ్య కాలంలో కొన్ని ఇస్స్యూస్ బాగా వైరల్ అవుతున్నాయి. వాటి మీద ట్రోలింగ్స్ కూడా పీక్స్ లో ఉంటున్నాయి. మాధురి రాథోడ్ విషయం కూడా అలాంటిదే. ఐతే దీని మీద హైపర్ ఆది జబర్దస్త్ లేడీ కమెడియన్ శాంతి కూడా రియాక్ట్ అయ్యారు. ఇంతకు ఆది ఏమన్నాడంటే ...
"మనుషులన్నాక ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేసే ఉంటారు శాంతి. మనీ విషయంలోనా , వస్తువు విషయంలోనా, మాట విషయంలోనా ఏదో ఒక రూపంలో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అలా అని దొరికిందే ఛాన్స్ అని ఒకరి తప్పును వేలెత్తి చూపించడమో వీళ్లకు ఇలాగే జరగాలని ఆనందపడడమో వంటివి చేయకూడదు. ప్రతీ ఒక్కరి విషయంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. అబ్బా భలే జరిగిందిరా అని ఆ రోజుకు ఆ మ్యాటర్ ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయడం వంటివి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. నిజానికి ఆ ఇన్సిడెంట్ లో ఆలోచించాల్సింది ఏంటంటే మాధురి రాథోడ్ అనే అమ్మాయికి పెళ్లి కాలేదు అవతల అమ్మాయికి పెళ్లయ్యింది. ఎవరైతే ఆ వీడియో తీశారో ఆ అమ్మాయి గురించి ఒకసారి ఆలోచించాలి.
ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి. ఆ అమ్మాయిని పబ్లిక్ గా అలా చూపించేయడం అందరూ అలా మాట్లాడుకోవడం తప్పు. వాళ్లిద్దరూ ఎప్పటినుంచో రీల్స్, సాంగ్స్ చేస్తూ ఏ విధంగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారో మనకు తెలీదు. కానీ అతను చేసిందీ తప్పే. ఏమిటి ఎలా జరిగింది అన్నది పక్కన పెడితే అది పబ్లిక్ చేయడం ఆ అమ్మాయిని పర్టికులర్ గా ట్రోల్స్ చేయడం ప్రతీ ఒక్కళ్ళు మాట్లాడుకోడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఆ అమ్మాయి లైఫ్ ని దృష్టిలో పెట్టుకుని ఆ ట్రోల్స్ ఆపాలని కోరుకుంటున్నా... తప్పులన్నాక ప్రతీ ఒక్కరి విషయంలో ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం ఇంకొకరి తప్పును ఎంజాయ్ చేయకుండా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శాంతి.
ఈరోజుల్లో ఎవరికీ ఎంత చెప్పినా ట్రోలింగ్ అనేది కామన్ ఐపోయింది శాంతి. అది తీసుకునే దమ్ము కూడా ఉండాలి. నా లాంటి వాడిని ఎన్నో రకాలుగా ట్రోల్ చేసుకోలా నేను పట్టించుకోను నాకు వాళ్ళ వలన రూపాయి రాదు. రూపాయి పోదు. కాబట్టి నేను వాళ్ళను పట్టించుకోను. నా పని, నా టాలెంట్ చేసుకుంటూ వెళ్లిపోతుంటా. ఇవన్నీ పట్టించుకుంటే మనం లైఫ్ లో ముందుకు వెళ్లలేం. ఎందుకంటే వాళ్ళు మనల్ని పోషించే వాళ్ళు కానీ బాధల్లో ఉంటే రూపాయి ఇచ్చే వ్యక్తులు కూడా కారు. తట్టుకోలేని వాళ్ళు అనుకున్నప్పుడు ట్రోల్స్ ఆపేయండి. తట్టుకోగలరు అనుకున్నప్పుడు ఎంతైనా ట్రోల్స్ చేసుకోండి.





.webp)
