Home

»

Tv News

Agnipariksha season2 : బెలూన్ టాస్క్ లో అదరగొట్టిన హేమంత్.. ఫెదర్ టాస్క్ లో గేమ్ ఛేంజర్ రాజకుమారి!

Sep 5, 2026 10:22AM

అగ్నిపరీక్ష సీజన్ 2 హోరాహోరీగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో 

షాలిని వైల్డ్ ఫైర్ కార్డ్ అయిపోయాక గేమ్ మరింత ఇంటెన్స్ అయింది. నాలుగో టాస్క్ లో హేమంత్, అపూర్వ మధ్య స్ట్రాలతో ప్లాస్టిక్ బెలూన్స్ పట్టుకుని బీకర్ లో నింపే టాస్క్ పెట్టారు. ఇది గాలి కంట్రోల్, పేషెన్స్ తో కూడిన టాస్క్. అపూర్వ కష్టపడుతుంటే హేమంత్ చాలా స్మూత్ గా బెలూన్స్ ను బీకర్ లోకి ట్రాన్స్ ఫర్ చేసి అద్భుతంగా గెలిచాడు.

 

ఆ తర్వాత ఐదో టాస్క్ లో రాజకుమారి, షాలిని మధ్య కలర్ మ్యాచింగ్ టాస్క్ పెట్టారు. సేమ్ కలర్స్ రంగుల్ని ఒకే బార్ కి పెట్టాలని.. అంతకంటే ముందు మీద ఉన్న రింగుల్ని తీయాలని రూల్ చెప్పారు. హైట్ ఎక్కువగా ఉండటంతో షాలిని రింగులు తీయడంలో ఇబ్బంది పడింది. దీంతో హైట్ ప్రాబ్లం వల్ల షాలిని టాస్క్ ఓడిపోయింది.. రాజకుమారి గెలుస్తుంది.

 

ఈ టాస్క్ ఓడిపోయాక షాలిని ఎమోషనల్ అయింది. ఆ కార్డ్ ఇక్కడ వాడాల్సింది.. నేను తీసుకున్న గోతిలో నేనే పడ్డానని బాధపడింది. అంటే సూట్ కేసు టాస్క్ లో కార్డ్ ను వేస్ట్ చేశానని ఆమెకు అర్థమైంది. ఇదే సమయంలో రాజకుమారి బ్రేక్ తీసుకోవాలని అనుకుంది కానీ లక్కీ డ్రాలో చరణ్ పేరు రావడంతో ఆమెకు ఆప్షన్ లేకుండాపోయింది.

 

వెంటనే చరణ్, రాజకుమారి మధ్య ఈకలు ఊదే టాస్క్ పెట్టారు. ఇది లైట్ గా ఉన్నా ఫోకస్ తప్పితే ఓడిపోయే టాస్క్. చివరకు రాజకుమారి గెలిచి తన ప్లేస్ ను సేవ్ చేసుకుంది. ఈ ఫైట్ ఫర్ బీబీ10 టాస్క్ రేపు కూడా కంటిన్యూ అవుతుందని చెప్పడంతో చివరకు బీబీ10 టికెట్ ఎవరికి వస్తుందోననే ఉత్కంఠ పీక్స్ కి చేరింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com