Home

»

Tv News

Bigboss season 10 Update : బిగ్ బాస్ హౌస్ లోకి రిషి సర్ ఎంట్రీ .. దశావతారం సీజన్ కు ఇదే హైలైట్!

Sep 5, 2026 10:25AM

తెలుగు బుల్లితెరపై రిషి సర్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ముఖేష్ గౌడ అలియాస్ రిషి.. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  దశావతారం  కాన్సెప్ట్ తో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న ఈ గ్రాండ్ సీజన్ లో అత్యంత క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ గా ముఖేష్ పేరు బలంగా వినిపిస్తోంది.

 

మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టి 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ గెలిచిన ముఖేష్ గౌడ.. కన్నడ 'నాగకన్నిక' సీరియల్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగులో 'ప్రేమ నగర్' చేశాడు. ఆ  తరువాత 'గుప్పెడంత మనసు' సీరియల్ లో కాలేజీ ఓనర్ రిషిగా, అలాగే ఆటో డ్రైవర్ రంగాగా ద్విపాత్రాభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. అతడి లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కు అమ్మాయిలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

 

ఈ క్రేజీ హీరోకు ఇది మొదటి బిగ్ బాస్ ఆఫర్ కాదు. గతంలోనే తెలుగు బిగ్ బాస్ తో పాటు కన్నడ బిగ్ బాస్ నుంచి కూడా భారీ రెమ్యునరేషన్ తో ఆఫర్లు వచ్చాయంట కానీ అప్పట్లో గేమ్ అర్థం కాక రెండుసార్లు తిరస్కరించానని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమా అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు బిగ్ బాస్ వేదికగా తనను తాను మళ్ళీ నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

 

ఒకవేళ ముఖేష్ గౌడ నిజంగానే హౌస్ లోకి వస్తే టీఆర్పీలు రికార్డు స్థాయికి చేరడం ఖాయమని బిగ్ బాస్ విశ్లేషకుడు ఆదిరెడ్డి సైతం అంచనా వేశారు. సీరియల్ ఆడియన్స్ మొత్తం ఆయనకు సపోర్ట్ గా నిలుస్తారని, టాప్ లో కాదు విన్నర్ గా నిలిచినా ఆశ్చర్యం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. అధికారిక క్లారిటీ గ్రాంఢ్ లాంచింగ్ రోజునే రానుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com