
బిగ్ బాస్ సీజన్ 10 కోసం జరుగుతున్న అగ్నిపరీక్ష సీజన్ 2 ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. వైల్డ్ ఫైర్ కార్డ్ తర్వాత సెకండ్ రౌండ్ లో మిథిలేష్, రామకృష్ణ మధ్య పిరమిడ్ క్రియేట్ చేసే టాస్క్ జరిగింది. ఇది పూర్తిగా ఫోకస్, బ్యాలెన్స్ తో కూడిన టాస్క్. ఇద్దరూ పిరమిడ్ ను నిలబెట్టేందుకు ట్రై చేయగా మిథిలేష్ వేగంగా కంప్లీట్ చేసి గెలిచాడు. దీంతో రామకృష్ణ ఆట నుంచి తప్పుకున్నాడు.
ఆ తర్వాత మూడో టాస్క్ లో షాలిని, మిథిలేష్ మధ్య బట్టలు మడతపెట్టి సూట్ కేసులో పెట్టే టాస్క్ పెట్టారు. చూడటానికి సింపుల్ గా ఉన్నా టైమ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో షాలిని తప్పటడుగు వేసి మిథిలేష్ సూట్ కేసును గెలికేందుకు ప్రయత్నించింది. దీనికి కౌంటర్ గా మిథిలేష్ కూడా షాలిని సూట్ కేసును తీసి అవతల పడేశాడు.
ఇలా ఇద్దరూ ఒకరి సూట్ కేసు ఒకరు లాగి పారేసుకుంటూపోయారు. దీంతో ఈ ఆటలో ఇద్దరూ ఓడినట్టే అని సంఛాలక్ గా ఉన్న ప్రియాంక చెప్పింది. అప్పుడు జ్యూరీ షాలినిని పిలిచి మరి నీ వైల్డ్ ఫైర్ కార్డును వాడుకుని మళ్లీ ఆ ఆట ఆడతావా అని అడిగింది. దానికి షాలిని ఆడతానని చెప్పింది.
వెంటనే జ్యూరీ సీరియస్ అయింది. అసలు నీకేమైనా పిచ్చా, టాస్కులో ఎందుకు అలా ఆడావ్.. అది స్ట్రాటజీనా.. కార్డ్ ఎవరైనా ఇప్పుడు వాడతారా.. నువ్వు చేయలేని ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు వాడాలని తిట్టేశారు. అయిన షాలిని కార్డ్ వాడటంతో పవర్ అయిపోయింది. రీసెట్ చేసిన ఆటలో షాలిని గెలిచి మిథిలేష్ ఆట నుంచి ఎలిమినేట్ అయ్యాడు.






