
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం నామినేషన్స్ ఎపిసోడ్ లో రచ్చ జరిగింది. త్రిగుణ్, రోహిత్ గొడవల మధ్య లేడీస్ గొడవ హైలైట్ అయింది. వర్షిణి, షాలినీ మధ్య జరిగిన ఫైట్ చూసి లైవ్ చూసిన ఆడియన్స్ షాక్ అయ్యారు. కుళాయిల దగ్గర నీళ్ల కోసం బిందెలతో కొట్టుకునే బ్యాచ్ లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.అసలు గొడవ ఎలా మొదలైందంటే.. నామినేషన్స్ టాస్క్ లో త్రిగుణ్, రోహిత్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అప్పుడు రోహిత్ కి సపోర్ట్ గా షాలినీ చప్పట్లు కొట్టింది. అది చూసి వర్షిణికి కోపం వచ్చింది. ఇందాక నరేష్ గురించి మాట్లాడేటప్పుడు వర్షిణి చప్పట్లు కొట్టిందని మీరు ఫేవరిటిజం అన్నారు కదా, ఇప్పుడు మీరు ఎందుకు చప్పట్లు కొడుతున్నారని షాలినీని వర్షిణి నిలదీసింది.
దాంతో షాలినీ.. నేను ఆ డిస్కషన్ లో ఉన్నాను కాబట్టి రియాక్ట్ అయ్యానని అంది. నేను కూడా ఆ డిస్కషన్ లోనే ఉన్నానంటూ మీద మీదకి వచ్చింది. ఇద్దరూ ఒకరి మొహం ముందు ఒకరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ రెచ్చిపోయారు.మాటల యుద్ధం కాస్తా ఫిజికల్ యుద్ధంగా మారింది. వర్షిణి కోపంలో షాలినీ గుండెలపై చేయి వేసి బలంగా వెనక్కి నెట్టేసింది. దాంతో షాలినీ.. ఏం చేస్తున్నావ్, ఎందుకు టచ్ చేశావ్, ఫిజికల్ అవుతున్నావంటూ గట్టిగా అరిచింది. నేను నెట్టానా, నెట్టానా అని వర్షిణి అంటున్నా షాలినీ వినలేదు.
ఆ టైమ్ లో రోహిత్ కల్పించుకొని.. వాదన జరుగుతున్నప్పుడు ఫిజికల్ గా టచ్ చేయడం తప్పు అంటూ షాలినీకి మద్దతు ఇచ్చాడు. త్రిగుణ్ మాత్రం వర్షిణికి సపోర్ట్ గా నిలబడ్డాడు. ఇద్దరూ జుట్టు జుట్టు పట్టుకునేంత వరకు వెళ్లారు. చివరికి శ్రిష్టి వచ్చి ఇద్దరి మధ్యలోకి వెళ్లి విడదీసింది. ఈ ఫైట్ ఎపిసోడ్ లో ఎంత వరకు చూపిస్తారో తెలియదు. ఇక వీకెండ్ లో నాగార్జున దీనిపై గట్టిగా వార్నింగ్ ఇస్తాడనిపిస్తోంది.






