Home

»

Tv News

Prabhakar on bigboss 10 Telugu :సుధీర్ పై శ్రిష్టి దారుణం - "ఇలాంటి ఫేక్ మనుషుల్నే జనం నమ్ముతారు" అంటూ ఫైర్!

Sep 23, 2026 11:26AM

బిగ్ బాస్ హౌస్‌లో నిన్న జరిగిన నామినేషన్స్‌లో సుధీర్‌ని శ్రిష్టి త్రిగుణ్ దారుణంగా టార్గెట్ చేశారు. నాకు ఫ్రీడమ్ వచ్చిందని సుధీర్ అనడానికే వేరే అర్థం తీసి శ్రిష్టి అతని క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడటమే కాదు, తలపై చెత్త విసిరి మొహానికేసి కొట్టింది. దాన్ని చూసి త్రిగుణ్ రాక్షసానందం పొందాడు. పళ్లు రాలగొడతా, ఇడియట్ అంటూ శ్రిష్టి రెచ్చిపోయింది. ఈ గొడవను చూసిన ప్రభాకర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు, కానీ ఇక్కడ సుధీర్‌ని పడగొట్టాలని చూసిన వాళ్లే బొక్కబోర్లా పడ్డారంటూ శ్రిష్టిని శకునిలా రెచ్చగొట్టిన త్రిగుణ్‌కి ఇది చెంపపెట్టు అన్నాడు.

ప్రభాకర్ తన వీడియోలో.. నిన్న బిగ్ బాస్ చూశాను.. అది మనసులో నుంచి పోవడం లేదు. సుధీర్ అనే కుర్రాడు ఘోరంగా బలైపోయాడు. జనాలు అటెన్షన్ కోసం గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ పిల్లోడు అన్న మాటకు వంకర అర్థం తీసి, ఇద్దరు ముగ్గురు ఆజ్యం పోశారు. త్రిగుణ్, రోహిత్, షాలిని దానికి సపోర్ట్ చేశారు. అమన్ సడెన్‌గా మధ్యలోకి వచ్చి గొడవకు దిగాడు. అసలు అతను ఏ తప్పూ చేయలేదు.. కానీ అందరు వాయిస్ రేజ్ చేసి దాదాగిరి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది బిగ్ బాస్ లోనే కాదు, సొసైటీలో కూడా జరుగుతోంది. జెన్యూన్ గా ఉన్నవాడిని వదిలేసి, ఫేక్ గా అబద్ధాలు చెప్పేవాళ్ల వెనకే ఎక్కువ మంది ఉంటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు.

గత సీజన్లు కాస్త సెన్స్‌బుల్‌గా ఉండేవి. కానీ ఈసారి ఒక్కరు కూడా సరిగ్గా ప్రవర్తించడం లేదు. అందరు అరుపులు, గొడవలు చేస్తేనే కెమెరా చూపిస్తుందని అనుకుంటున్నారు. సుధీర్ ఎమోషనల్ అయ్యాడు..‌అతను చాలా బాధపడి ఉంటాడని ప్రభాకర్ చెప్పాడు. అనూహ్యంగా టార్గెట్ అయిన సుధీర్‌కి ఇప్పుడు ఆడియన్స్ నుంచే కాదు.. సెలబ్రిటీల నుంచి కూడా మద్దతు పెరుగుతోందని అన్నాడు. అయ్యో పాపం అనుకునే కంటెస్టెంట్‌కే జనం వెన్నుదన్నుగా నిలుస్తారని.. ఈ దారుణంతో సుధీర్ రేస్‌లోకి టాప్ గేర్‌తో వచ్చాడని ప్రభాకర్ అభిప్రాయపడ్డాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com