Home

»

Tv News

Bigg Boss 10 Telugu: Bigg Boss 10 Telugu: షాలినిని కన్ఫెషన్ రూంకి పిలిచి మరీ తిట్టిన నాగార్జున!

Oct 11, 2026 11:35AM

బిగ్ బాస్‌  వీకెండ్ ఎపిసోడ్ అంటే బిగ్ బాస్‌ చూసే ఆడియన్స్ కి  విపరీతమైన క్రేజ్. ఎందుకంటే వారనంతా హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా చేశారు.. ఏం తప్పు ఆడారంటూ క్లాస్ పీకుతుంటే ఆ మజానే వేరు.  ఇక నిన్నటి శనివారం నాటి 35వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అదిరిపోయే స్టెప్స్ వేసి వచ్చేశాడు. ఇక వచ్చీ రాగానే షాలినిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు.

నామినేషన్స్ టైమ్‌లో సెలబ్రిటీలంతా కలిసి.. ఎవర్ని నామినేట్ చేయాలో డిస్కస్ చేసి నామినేట్ చేశారా? అని సూటిగా షాలినిని అడిగాడు నాగార్జున. అంటే నాకు అలా అనిపించింది సార్ అని చెప్పింది షాలిని. దాంతో నాగార్జున.. ఈ వీడియో చూడు అంటూ.. మన రోహిత్ బాబు ఎవరెవర్ని నామినేట్ చేయాలో చెప్తున్న వీడియోను ప్లే చేశారు. ‘చిన్న రీజనా.. పెద్ద రీజనా.. అని చూడొద్దు. అందర్నీ (సెలబ్రిటీలు) లాగేద్దాం. చిన్న పెద్ద కూడా చూడొద్దు. మీ మనసుకి అది చిన్నదని అనిపించినా సరే.. అవన్నీ పక్కనపెట్టి అందర్నీ నామినేషన్‌లోకి లాగేయండి’ అంటూ రోహిత్ చెప్పిన వీడియో చూపించి మరీ వాయింపు స్టార్ట్ చేశారు నాగార్జున.

సెలబ్రిటీలంతా అనుకుని నామినేట్ చేశారని అన్నావ్ కదా.. మరి దీన్ని ఏమంటారూ అని అడిగారు నాగార్జున. ‘ప్రతివారం వాళ్లు అలాగే నామినేట్ చేస్తున్నారు కాబట్టి.. మేం కూడా అలాగే ఆడుదాం అని అనుకున్నాం సర్ అని కవర్ చేసుకోబోయింది షాలిని. డిస్కషన్స్ వద్దని. నేను చెప్పిన తరువాత అందరూ ఆపేశారు కానీ.. మీరు మాత్రం మారడం లేదు. నేను చెప్పిన తరువాత కూడా అదే చేస్తున్నారు. నువ్వు లూప్‌లోకి వెళ్లడమే కాకుండా అదే లూప్‌లోకి అందర్నీ లాగుతున్నావ్. నామినేషన్స్ టైమ్‌లో వాళ్లంతా కలిసి ఆడుతున్నారని.. వాళ్లేదో మాట్లాడుకుని నామినేట్ చేస్తున్నారని అలిగేషన్స్ చేశావ్.. తీరా చూస్తే అది చేసింది మీరే కదా అంటూ నాగార్జున ఇచ్చిపడేశాడు.

 

 

[Bigg Boss 10 Telugu October 11 Episode, Nagarjuna Fires Shalini Nomination,Bigg Boss Telugu 10 Weekend Episode, Rohit Shalini Group Nominations]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com