Home

»

Tv News

Apoorva Elimination:  అపూర్వ ఎలిమినేషన్..‌ట్విస్ట్ అదుర్స్!

Oct 11, 2026 11:46AM

బిగ్ బాస్ తెలుగు 10 లో అతిపెద్ద ట్విస్ట్. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామన్ మ్యాన్ అపూర్వ జర్నీకి ఎండ్ కార్డ్ పడింది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీకి ముందే ఈ ఎలిమినేషన్ జరగడంతో హౌస్ అంతా షాక్ లో ఉన్నారు. అసలు విషయానికొస్తే బిగ్ బాస్ మొదలవ్వగానే సోషల్ మీడీయాలో ప్రతీరోజు జరిగిన ఎపిసోడ్ గురించి లీక్స్ వస్తుంటాయి. అందులోను ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ శనివారమే షూట్ అయిపోతుంది కాబట్టి శనివారం నైట్ వరకు ఎవరు ఎలిమినేషన్ అయ్యారని తెలిసిపోతుంది. ఈ లీక్స్ ప్రకారం అపూర్వ ఎలిమినేషన్ అయినట్టు తెలుస్తోంది. అయితే అపూర్వ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్. ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో ఆల్రెడీ గేమ్ డైనమిక్స్ చేంజ్ అవుతున్నాయి. 

అయిదో వారంలో ఝాన్సీ, చరణ్, అపూర్వ, అమన్, షాలిని, రాం ప్రసాద్, నరేష్, త్రిగుణ్, ముకేష్, రోహిత్.. ఈ పది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఎలాగూ త్రిగుణ్, ముకేష్, రోహిత్‌లు టాప్‌లో ఉంటున్నారు.. ఈవారం కూడా ఉన్నారు. సగానికి సగం కాదు.. దాదాపు 70 శాతం ఓటింగ్ ఈ ముగ్గురే పంచేసుకుంటున్నారు. ఇక మిగిలిన 30 శాతం ఓటింగ్‌కి ఏడుగురు పోటీ పడటంతో వాళ్లలో ఐదారుగురికి సింగిల్ డిజిట్ ఓటింగ్ దక్కింది. నరేష్ ఫస్ట్ టైమ్ నామినేషన్స్‌లోకి రాగా.. రాం ప్రసాద్‌కి జబర్దస్త్ క్రేజ్ ఉండటంతో.. ఈ ఇద్దరికీ తొలి వారాల్లో అయితే ఎలిమినేషన్ ఇబ్బంది లేదు. ఓటింగ్ లో షాలిని వర్సెస్ అపూర్వ మధ్య గట్టి పోటీ నడిచింది. Road to Reload టాస్క్ లో అపూర్వకు 20 పాయింట్లు మాత్రమే రావడంతో ఆమె డేంజర్ జోన్ లోకి వెళ్లింది. షాలిని కూడా రోహిత్ తో ఓవర్ క్లోజ్ నెస్, నామినేషన్స్ లో గ్రూప్ డిస్కషన్ ఆరోపణలతో నెగెటివ్ అయింది. కానీ చివరికి తక్కువ ఓట్లతో అపూర్వే ఎలిమినేట్ అయినట్టు లీక్ అయింది. అపూర్వ వెళ్లిపోవడంతో రోహిత్ షాలిని ట్రయాంగిల్ లవ్ ట్రాక్ కి బ్రేక్ పడినట్టే. అలాగే త్రిగుణ్, రామ్ ప్రసాద్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి లాభం చేకూరనుంది. అపూర్వ ఇంకా ఉండాల్సింది, షాలిని కంటే బెటర్ గేమ్ ఆడిందని కొందరు, ఓవర్ యాక్షన్ వల్లే వెళ్లిపోయింది, కరెక్టే అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ గేమ్ ఛేంజింగ్ ఎలిమినేషన్ తో హౌస్ లో కొత్త స్ట్రాటజీలు మొదలవ్వబోతున్నాయి.

 

 

[Bigg Boss 10 Telugu Apoorva Elimination End Card, Wild Cards Entry Game Dynamics Change, Apoorva vs Shalini 5th Week Elimination, Bigg Boss Telugu 10 House Equations Change]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com